బ్యూటీ ప్రొడక్ట్స్ పై ధ్వజమెత్తిన పాక్ మహిళా క్రికెటర్

పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సానా మిర్ సౌందర్య సాధనాలను ప్రమోట్ చేసే కంపెనీలపై ధ్వజమెత్తారు.

Last Updated : Apr 25, 2018, 12:00 PM IST
బ్యూటీ ప్రొడక్ట్స్ పై ధ్వజమెత్తిన పాక్ మహిళా క్రికెటర్

పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సానా మిర్ సౌందర్య సాధనాలను ప్రమోట్ చేసే కంపెనీలపై ధ్వజమెత్తారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారుల చేత బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేయించే క్రమంలో.. అడ్వర్టైజ్‌మెంట్ డైరెక్టర్ల వల్ల క్రీడాకారిణులు బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. తాను కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కోవడం వల్లే ఎలాంటి సౌందర్య ఉత్పత్తుల యాడ్స్‌లోనూ నటించకూడదని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.

క్రీడాకారిణులు విజయం సాధించాలంటే కావాల్సింది టాలెంట్‌తో పాటు ఆత్మవిశ్వాసం మాత్రం కానీ.. అందం కాదని ఆమె పేర్కొన్నారు. అలాగని అన్ని యాడ్స్ కూడా అలాగే ఉండవని సానా మిర్ అన్నారు. కొన్ని యాడ్స్ మహిళల గౌరవానికి భంగం కలిగించే రీతిలో ఉండేవని.. వారి ఔన్నత్యాన్ని పెంచే విధంగానే ఉంటాయని తెలిపారు. అలాంటి యాడ్స్‌లో తనకు నటించడానికి అభ్యంతరం లేదని అన్నారు. 

ముఖ్యంగా క్రీడాకారిణులకు సంబంధించిన యాడ్స్ తీస్తున్నప్పుడు ప్రేక్షకుల ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఆమె అన్నారు. క్రీడాకారిణులు బాడీ షేమింగ్ బారిన పడ్డారన్న ఫీలింగ్ వారికి కలగకూడదన్నారు. తన 12 సంవత్సరాల క్రీడా కెరీర్‌లో ఇలాంటి కారణాల వల్లే తాను అనేక ఎండార్స్‌మెంట్లు కోల్పోయిన్నట్లు సానా మిర్ పేర్కొన్నారు. సానా పాక్ క్రికెట్ జట్టుకి మాజీ కెప్టెన్. తన కెరీర్‌లో 190 వికెట్లు తీశారామె. అలాగే పాకిస్తాన్ తరఫున 100 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా కూడా సానాకి పేరుంది. 

Trending News