Babar Azam Equals Ricky Ponting Record: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఒక దాని తరువాత ఒకటి వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజా మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాఉ. కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సంవత్సరంలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా బాబర్ అజామ్ నిలిచాడు. ఈ విషయంలో ప్రపంచ దిగ్గజ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా బాబర్ అజామ్ వెనుకే ఉన్నాడు.
2017, 2019లో కోహ్లి 21-21 హాఫ్ సెంచరీలు సాధించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి కోహ్లీ రాజీనామా చేసినందున.. ఇక ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశ లేదు. రికీ పాంటింగ్ 17 ఏళ్ల రికార్డును బాబర్ అజామ్ సమం చేశాడు. 2005 సంవత్సరంలో రికీ పాంటింగ్ 24 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇది ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక అర్ధ సెంచరీలు. అయితే ఇప్పుడు ఈ రికార్డును బాబర్ సమం చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఏడాది పాక్ కెప్టెన్ 24 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. పాంటింగ్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో బాబర్ మరో హాఫ్ సెంచరీ సాధిస్తే.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 25 హాఫ్ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల సృష్టిస్తాడు. డిసెంబర్ 26 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ 54 పరుగులు చేసి రికీ పాంటింగ్ అతిపెద్ద రికార్డును సమం చేశాడు.
అదేవిధంగా బాబర్ తన పేరిట మరో రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 కంటే ఎక్కువ టెస్టు పరుగులు చేసిన పాకిస్థాన్‌కు చెందిన 7వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2022లో బాబర్ అజామ్ టెస్టుల్లో 1000 పరుగుల మార్కును అధిగమించాడు. వీరితో పాటు అజర్ అలీ, యూనస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్, ఇంజమామ్ ఉల్ హక్, మొహ్సిన్ ఖాన్‌లు పాకిస్థాన్ నుంచి ఈ ఘనత సాధించారు.
Also Read: Twitter Poll: లేపి తన్నించుకోవడమంటే ఇదే, ఎలాన్‌మస్క్‌కు షాక్ ఇచ్చిన యూజర్లు
Also Read: Andhra pradesh: ఏపీలో త్వరలో మరిన్ని ఐటీ కంపెనీలు, 184 కోట్లతో అమెజాన్ ఫెసిలిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook