Shan Masood Run Out and Hit Wicket: క్రికెట్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒకే బంతికి బ్యాట్స్‌మెన్ హిట్ వికెట్, రనౌట్ అయినా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లీగ్‌లో టోర్నీలో ఈ ఘటన జరిగింది. పాకిస్థాన్ ఆటగాడు షాన్ మసూద్ యార్క్‌షైర్ తరపున ఆడుతున్నాడు. మసూద్ 58 పరుగులతో క్రీజ్‌లో ఉన్నప్పుడు.. 15వ ఓవర్లో లంకాషైర్‌కు చెందిన జాక్ బ్లాథర్విక్ను బంతిని వేశాడు. బ్యాక్‌ఫుట్‌లో బంతిని కొట్టే ప్రయత్నంలో మసూద్ కాలు స్టంప్స్‌కు తగిలింది. దీంతో ఔట్‌గా భావించి క్రీజు బయటకు వచ్చి కాస్త తడపడ్డాడు. అయితే నాన్‌స్టైకర్ ఎండ్‌లో ఉన్న జో రూట్.. పరుగు కోసం పరిగెత్తుకుని వచ్చాడు. మసూద్ కూడా క్రీజ్ దాటి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు వెళ్లాడు. ఈ లోపు లంకాషైర్ ఆటగాళ్లు బంతిని తీసుకుని స్టంప్స్‌ను పడగొట్టారు. దీంతో మసూద్ హిట్ వికెట్, రనౌట్ అయినా.. అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. ఎందుకంటే..
Also Read: Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
బంతిని నోబాల్‌కు ప్రకటించారు. నో బాల్‌గా ప్రకటిస్తే.. బ్యాట్స్‌మెన్ హిట్ వికెట్‌గా అయినా నాటౌట్ అవుతారు. అయితే రనౌట్ ప్రకటించవచ్చు. ఈ సమయంలో రూల్ 31.7ను అంపైర్ పరిగణలోకి తీసుకున్నారు. ఎంసీసీ క్రికెట్ లా ఆఫ్ క్రికెట్ 31.7 ప్రకారం.. బ్యాట్స్‌మెన్ తాను ఔట్ అయ్యానో లేనో అని డౌట్‌తో వికెట్ వదిలేసుకుంటే అంపైర్లు జోక్యం చేసుకుంటారు. బ్యాట్స్‌మెన్‌ను నాటౌట్‌గా ప్రకటించి.. డెడ్ బాల్‌కు సిగ్నల్ ఇస్తారు. మసూద్ విషయంలోనూ ఫీల్డ్ అంపైర్లు చర్చించి.. నాటౌట్‌గా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మసూద్ మరో 3 పరుగులు చేసి.. ఔట్‌గా వెనుదిరిగాడు.
మ్యాచ్ అనంతరం మసూద్ మాట్లాడుతూ.. తన కాలు వికెట్‌కు తాకగానే కాస్త అయోమయానికి గురయ్యాయని చెప్పాడు. అయితే జో రూట్ రన్ కోసం పరిగెత్తుకుని వచ్చాడని.. అతనే నోబాల్ అని తనకు చెప్పాడని తెలిపాడు. తాను అయినా ఇష్టం లేకపోయినా క్రీజ్ దాటి కొంచెం ముందుకు వచ్చానని.. ఈలోపు ఫీల్డర్లు బంతితో బెయిల్స్ పడగొట్టారని అన్నాడు. అయితే తాను రన్ కోసం రాలేదని గ్రహించిన అంపైర్లు నిబంధనల ప్రకారం నాటౌట్‌గా ప్రకటించారని.. ఈ ఘటన నుంచి త్వరగా ముందుకు సాగినందుకు అంపైర్లు, ప్రత్యర్థి ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు.
Also Read: Sexual Assault: పోర్న్ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter