Nicholas Pooran Captaincy: టీ20 వరల్డ్ కప్ ఓటమితో మరో కెప్టెన్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. పొట్టికప్‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు ఈసారి కనీసం క్వాలిఫై కూడా కాలేకపోయింది. సూపర్-12కి కూడా అర్హత సాధించలేకపోవడంతో కెప్టెన్ నికోలస్ పూరన్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాజయం తర్వాత అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు ప్రదర్శన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వరుసగా పసికూనల చేతిలో పరాజయం పాలైంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత స్కాట్లాండ్ కూడా 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశకు గురైన నికోలస్ పూరన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
కెప్టెన్సీకి రాజీనామా చేసిన అనంతరం నికోలస్ పూరన్ క్రికెట్ వెస్టిండీస్ విడుదల ఒక ప్రకటన విడుదల చేసింది. 'టీ20 ప్రపంచ కప్‌లో తీవ్ర నిరాశకు గురైనప్పటి నుంచి నేను కెప్టెన్సీ గురించి చాలా ఆలోచించాను. నేను చాలా గర్వంగా, అంకితభావంతో ఈ బాధ్యతలను స్వీకరించాను. గత ఏడాదిలో జట్టు కోసం ఎంతో కష్టపడ్డాను. టీ20 ప్రపంచ కప్ ఓటమి చాలా బాధిచింది. వచ్చే వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచి రెడీ అవుతా..' అని నికోలస్ పూరన్ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.
Not easy to put this out as captaining @windiescricket has been an honour like no other, but rest assured my passion and commitment remains firmly intact. pic.twitter.com/y502cfzoWB
— NickyP (@nicholas_47) November 21, 2022
ఒక జట్టుగా మళ్లీ కనెక్ట్ కావడానికి తమకు చాలా నెలల సమయం పడుతుందన్నాడు. తనపై నమ్మకం ఉంచినందుకు బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. 'ఈ అవకాశం కల్పించినందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు చాలా కృతజ్ఞతలు. నాపై నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అభిమానులు, నా సహచర ఆటగాళ్లు నుంచి నాకు ఎంతో మద్దతు లభించింది. వెస్టిండీస్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లి గర్వపడేలా చేయగల సామర్థ్యం మాలో ఉందని నాకు తెలుసు..' అంటూ నికోలస్ పూరన్ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకున్న విషయం తెలిసిందే.
Also Read: APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి సరికొత్త బస్సులు
Also Read: IND vs NZ: కివీస్ తో ఆఖరి టీ20 నేడే.. ఉమ్రాన్, సంజూలకు ఛాన్స్ ఇస్తారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook