కోహ్లీ ఖాతాలో మరో కలికితురాయి.. రాజీవ్ ఖేల్‌‌రత్న ప్రకటించిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు క్రీడా పురస్కారాలను ప్రకటించింది. విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

Last Updated : Sep 21, 2018, 12:26 PM IST
కోహ్లీ ఖాతాలో మరో కలికితురాయి.. రాజీవ్ ఖేల్‌‌రత్న ప్రకటించిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు క్రీడా పురస్కారాలను ప్రకటించింది. విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అలాగే 8 మంది కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు, 20 మందికి అర్జున పురస్కారం, నలుగురికి ధ్యాన్ చంద్ పురస్కారాలను అందిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈసారి ద్రోణాచార్య అవార్డుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావు ఎంపిక కావడం విశేషం.

అలాగే ద్రోణాచార్య అవార్డులు పొందిన వారిలో సుబేదార్ చేనంద అచయ్య కుటప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), సుక్ దేవ్ సింగ్ పన్ను (అథ్లెటిక్స్), క్లారెన్స్ లోబో (హాకీ లైఫ్ టైమ్), తారక్ సిన్హా (క్రికెట్ లైఫ్ టైమ్), జివాన్ కుమార్ శర్మ (జూడో), వి.ఆర్.బీదు (అథ్లెటిక్స్ లైఫ్ టైమ్) అవార్డులు పొందారు. అర్జున్ అవార్డులలో నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), సిక్కిరెడ్డి (బ్యాడ్మింటన్), సతీష్ కుమార్ (బాక్సింగ్), స్మ్రుతి మందానా (క్రికెట్),
మనికా బత్రా (టేబుల్ టెన్నిస్), రోహన్ బోపన్నా (టెన్నిస్) మొదలైన వారు అర్జున అవార్డులను పొందారు. 

ఇక ధ్యాన్ చంద్ అవార్డుల విషయానికి వస్తే.. సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భరత్ కుమార్ చెత్రీ (హాకీ), బాబీ అలాసిస్ (అథ్లెటిక్స్), దాదు దత్తాత్రేయ (రెజ్లింగ్) మొదలైన అవార్డులను కైవసం చేసుకున్నారు. అలాగే ఈసారి ప్రకటించిన రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2018 అవార్డుకి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, ఇషా అవుట్ రీచ్ సంస్థలు కూడా అవార్డులను కైవసం చేసుకోవడం విశేషం. ఇషా అవుట్ రీచ్ సంస్థ సద్గురు జగ్గీ వాసుదేవ్
సూచనల మేరకు నడుస్తుందన్న సంగతి తెలిసిందే.

Trending News