MI vs RR match score updates: రాజస్ధాన్ రాయల్స్‌కి ( Rajastan Royals ) మరో ఘోర పరాజయం తప్పలేదు. IPL 2020 లో భాగంగా మంగళవారం రాత్రి ఆడిన 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) జట్టుతో తలపడిన రాజస్థాన్ రాయల్స్.. 57 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముంబై ఇండియన్స్ సమిష్టి కృషితో రాణించగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు మెుత్తం సమిష్టిగా విఫలమై ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ముందు టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. Also read : IPL 2020: SRH పేసర్ భువనేశ్వర్ కుమార్ ఔట్.. సన్‌రైజర్స్‌కు ఈ సీజన్ కష్టమే!
ముంబై జట్టులో ఓపెనర్లు క్వింటన్ డీకాక్ (23;15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (35; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మ్యాచ్‌కి చక్కటి ఆరంభానివ్వగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav 79 నాటౌట్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో రెచ్చిపోయాడు. మధ్యలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా కృనాల్ పాండ్య 12 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. ఇక చివరిలో వచ్చిన హార్దిక్ పాండ్యా ( Hardik Pandya 30; 19 బంతుల్లో 2 ఫోర్లు , 1సిక్స్) స్కోర్ బోర్డుని పరుగులెత్తించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్ రెండు వికెట్లు తీసుకోగా, జోఫ్రా ఆర్చర్, కార్తిక్ త్యాగి చెరో వికెట్ పడగొట్టారు. Also read : KXIP vs CSK match: క్యాచ్‌లతో సెంచరీ కొట్టిన ధోనీ
అనంతరం 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఏ దశలోనూ ముంబై ఇండియన్స్కి పోటీ ఇవ్వలేక ఛేజింగ్‌లో వెనుకబడిపోయింది. ఆరంభంలోనే ఓపెనర్ యశశ్వీ జైశ్వాల్ (0), స్టార్ బాట్స్‌మెన్‌గా ప్రశంసలు అందుకున్న సంజూ శాంసన్ ( Sanju Samson ) 0 ) గోల్డెన్ డక్ కాగా... కెప్టెన్ స్టీవ్ స్మిత్ (6), మహిపాల్ లోమ్రోర్ (11) పరుగులతో సరిపెట్టుకుని జట్టుని మరింత కష్టాల్లోకి నెట్టారు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ( Jos Buttler ) 70 నాటౌట్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే ఒంటరిపోరాటం చేసినప్పటికీ.. 13 ఓవర్‌లో జేమ్స్ ప్యాటిన్సన్ వేసిన 3వ బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన జోస్ బట్లర్ బౌండరీ వద్ద పొలార్డ్ చేతికి చిక్కి ఔటయ్యాడు. Also read : KXIP vs CSK Highlights: ఇరగదీసిన వాట్సన్(83), డుప్లెసిస్(87).. చెన్నై సూపర్ విక్టరీ
ఆ తర్వాత టామ్ క్యూరన్ (15 పరుగులు; 16 బంతుల్లో 1 ఫోర్ ), జోఫ్రా ఆర్చర్ ( 24 పరుగులు; 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ )తో సరిపెట్టుకున్నారు. ఇక మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ ఆ మాత్రం కూడా రాణించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ( Rajastan Royals team ) 136 పరుగులకే ఆలౌటైంది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా ( Jasprit Bumrah ) నాలుగు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్, టామ్ పాటిన్‌సన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. రాహుల్ చాహర్, పొలార్డ్‌లకు చెరో వికెట్ లభించింది. అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ( MI vs RR match's Man of the match ) అందుకున్నాడు. Also read : MI vs SRH IPL 2020 match: ముంబై ఇండియన్స్‌ని చేజ్ చేయలేకపోయిన సన్‌రైజర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe