MS Dhoni Favourite Subject: ఎంఎస్ ధోనీకి ఇష్టమైన సబ్జెక్టు ఏంటో తెలుసా.. మీరు అస్సలు ఊహించలేరు!

Former India captain MS Dhoni reveals his Favourite School Subject. క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఎంఎస్ ధోనీ చదువుల్లో మాత్రం అంతంత మాత్రమే అట. మహీకి ఇష్టమైన సబ్జెక్ట్ఏంటో తెలుసా?  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 14, 2022, 01:05 PM IST
  • ధోనీకి ఇష్టమైన సబ్జెక్టు ఏంటో తెలుసా
  • మీరు అస్సలు ఊహించలేరు
  • స్పోర్ట్స్‌కు ఆ అర్హత ఉందా?
MS Dhoni Favourite Subject: ఎంఎస్ ధోనీకి ఇష్టమైన సబ్జెక్టు ఏంటో తెలుసా.. మీరు అస్సలు ఊహించలేరు!

MS Dhoni Favourite School Subject: ఎంఎస్ ధోనీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడుగా నిలిచాడు. తన బ్యాటింగ్‌తో టీమిండియాకు తిరుగులేని విజయాలు ఎన్నో అందించాడు. ఇక మహీ తన అద్భుత కెప్టెన్సీతో టీమిండియాను టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిపాడు. అంతేకాదు టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు. క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీనే. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా ధోనీ తనదైన ముద్ర వేశాడు. క్రికెట్‌లో కింగ్ అయిన ధోనీ.. చదువుల్లో మాత్రం అంతంత మాత్రమే అట. ఈ విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ స్వయంగా చెప్పారు. 

రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఎంఎస్ ధోనీకి సంబంధించిన వీడియోను ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో మహీ స్కూల్ పిల్లలతో మాట్లాడుతూ.. వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఓ చిన్నారి స్కూల్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటన్న ప్రశ్నించగా.. ధోనీ నవ్వుకున్నారు. 'స్పోర్ట్స్‌కు ఆ అర్హత ఉందా?' అని నవ్వుతూ బదులిచ్చారు. పీటీ క్లాస్ అంటే తనకు చాలా ఇష్టమని, అప్పుడు ఆడుకోవచ్చు కదా అని పేర్కొన్నారు. 

'ఏడో తరగతిలో నేను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు సగటు విద్యార్థిని. ఆపై నా హాజరు శాతం తగ్గుతూ వచ్చింది. పదో తరగతిలో 66 శాతం, 12 క్లాస్‌లో 56-57 శాతం మార్కులు వచ్చాయి. నేను పాసవనని మా నాన్న బలంగా నమ్మేవారు. పాసయ్యాక ఆ విషయాన్ని ఆయనకు పదేపదే చెప్పేవాడిని. టెన్త్ క్లాసులో కొన్ని చాప్టర్లు గురించి తెలిసేది కాదు. ఆ చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తే ఏం రాయలన్నది కూడా తెలిసేది కాదు' అని చెప్పారు. 

టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పారు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో మహీ 10773 రన్స్‌ బాదారు. ఇందులో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 183‌. 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల చేసారు. పొట్టి ఫార్మాట్లో మహీ రెండు హల సెంచరీలు చేసారు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 56. ఇక 234 ఐపీఎల్ మ్యాచులలో 4978 రన్స్ చేశారు. 

Also Read: Python in Khammam: గ్రామంలోకి భారీ కొండచిలువ.. పరుగులు తీసిన జనాలు!

Also Read: Mars Transit 2022: అక్టోబర్ 16న మిథున రాశిలోకి అంగారకుడు.. ఈ 5 రాశుల వారికి దీపావళి రోజున అదృష్టమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News