Ind vs NZ: సొంత పిచ్‌పై, కన్నతల్లి చూస్తుండగా చెలరేగిన సిరాజ్, 4 వికెట్లతో కివీస్ నడ్డి విరిచిన హైదరాబాదీ పేసర్

Ind vs NZ: హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ సూపర్ స్పెల్‌తో అదరగొట్టాడు. తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై విజయంలో కీలకపాత్ర పోషించాడు. పరుగుల మోత మోగించిన పిచ్‌పై 4 వికెట్లతో చెలరేగిపోయాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 19, 2023, 07:32 AM IST
Ind vs NZ: సొంత పిచ్‌పై, కన్నతల్లి చూస్తుండగా చెలరేగిన సిరాజ్, 4 వికెట్లతో కివీస్ నడ్డి విరిచిన హైదరాబాదీ పేసర్

హైదరాబాద్ ఉప్పల్ స్డేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమ్ ఇండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. సొంత పిచ్‌పై తొలి వన్డే ఆడిన మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. అద్భుత స్పెల్‌కు కివీస్ కీలక వికెట్లు రాలిపోయాయి.

హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ కివీస్ తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత్ బోణీ చేసింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల చేయగా కివీస్ నిర్ణీత 49.2 ఓవర్లలో 337 పరుగుల చేసి ఆలవుట్ కావడంతో ఇండియా విజయం ఖరారైంది. రెండువైపుల్నించి పరుగుల మోత మోగించిన మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అద్భుత్ స్పెల్‌తో అదరగొట్టేశాడు. 

సొంత పిచ్‌పై తొలి వన్డే ఆడటమే కాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో జన్మనిచ్చిన తల్లి చూస్తుండగా చెలరేగిపోయాడు మొహమ్మద్ సిరాజ్. ఇటీవల శ్రీలంకపై 4 వికెట్ల స్పెల్‌తో అదరగొట్టిన మొహమ్మద్ సిరాజ్..మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పవర్ ప్లేలోనే కివీస్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే వికెట్ తీసి తానేంటో రుజువు చేశాడు. సిరాజ్‌కు తోడుగా కులదీప్ యాదవ్ చెలరేగాడు. ఆ తరువాత లాథమ్, సాన్‌ట్నర్, షిప్లీలను అవుట్ చేయడం ద్వారా మరోసారి 4 వికెట్ల హాల్ సాధించాడు. 

శుభమన్ గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో ఇండియా 347 పరుగుల భారీ స్కోర్ సాధించినా..కివీస్ బ్యాటర్లు బ్రేస్‌వెల్, శాంట్నర్ జోరు చూస్తే ఓ దశలో ఇండియాకు ఓటమి తప్పదన్పించింది. అయితే శాంట్నర్‌ను మొహమ్మద్ సిరాజ్ అవుట్ చేయడంతో పాటు ఆ తరువాత బంతికి షిప్లీని వెనక్కి పంపించడంతో మ్యాచ్ తిరిగి ఇండియా వైపుకు మరలింది. సొంత పిచ్‌పై కన్న తల్లి ముందు అద్భుతమైన స్పెల్‌తో చెలరేగిన సిరాజ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మొత్తానికి 10 ఓవర్లు బౌల్ చేసి 46 పరుగులు ఇచ్చిన మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 మెయిడిన్ ఓవర్లున్నాయి. న్యూజిలాండ్ ఓ దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా..7వ వికెట్ కు రికార్డు భాగస్వామ్యంతో బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ 162 పరుగులు చేర్చడంతో ఇండియా ఓటమివైపుకు సాగింది. ఈ దశలో మొహమ్మద్ సిరాజ్..శాంట్నర్‌ను అవుట్ చేయడంతో పరిస్థితి మారింది. 

Also read: India Vs New Zealand 1st ODI LIVE: రెండో వికెట్ పడగొట్టిన సిరాజ్.. న్యూజిలాండ్‌ స్కోర్ 131/6!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News