PAK vs ENG: పాకిస్తాన్, ఇంగ్లండ్ ఫైనల్‌కు వరణుడి ముప్పు.. మ్యాచ్‌ రద్దు అయితే విజేత ఎవరో తెలుసా?

Rain Threat for Pakistan vs England Final in T20 World Cup 2022. పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే టీ20 ప్రపంచకప్‌ 2022 ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 11, 2022, 04:51 PM IST
  • పాకిస్తాన్, ఇంగ్లండ్ ఫైనల్‌కు వరణుడి ముప్పు
  • మ్యాచ్‌ రద్దు అయితే విజేత ఎవరో తెలుసా?
  • 1992 వన్డే ప్రపంచకప్ ఫలితం రిపీట్
PAK vs ENG: పాకిస్తాన్, ఇంగ్లండ్ ఫైనల్‌కు వరణుడి ముప్పు.. మ్యాచ్‌ రద్దు అయితే విజేత ఎవరో తెలుసా?

Rain Threat for Pakistan vs England Final in T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌ 2022 ఫైనల్ సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఆదివారం (నవంబర్‌ 13) జరిగే ఫైనల్లో పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. మెల్‌బోర్న్‌ మైదానంలో మధ్యాహ్నం 1.30 ఫైనల్‌ మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రపంచకప్‌ 2022 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను పాక్ ఓడించగా.. రెండో సెమీ ఫైనల్లో భారత్‌ను ఇంగ్లండ్‌ ఓడించిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఏ జట్టు గెలిచినా.. రెండోసారి పొట్టి కప్ ఖాతాలో వేసుకుంటుంది. 2009లో పాక్ కప్ గెలవగా.. 2010లో ఇంగ్లండ్ గెలిచింది.

టీ20 ప్రపంచకప్‌ 2022 ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ జరిగే సమయంలో 90 నుంచి 95 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని బ్యూరో ఆఫ్‌ మెట్రాలజీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 'ఆదివారం మెల్‌బోర్న్‌ మొత్తం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్‌ జరిగే సమయంలో 90-95 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం గంటకు 25-40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి' అని బ్యూరో ఆఫ్‌ మెట్రాలజీ తెలిపింది.

ఐసీసీ షెడ్యూల్ ప్రకారం... సెమీ ఫైనల్స్,ఫైనల్‌ మ్యాచులకు రిజర్వ్‌ డే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆదివారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మ్యాచుకు వర్షం అంతరాయం‍ కలిగిస్తే.. రిజర్వ్‌ డే రోజున మ్యాచ్ ఉంటుంది. ఒకవేళ ఆదివారం సగం ఆట మాత్రమే సాధ్యమయితే.. రిజర్వ్‌ డే (సోమవారం)న అక్కడి నుంచే  కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్‌ డే (సోమవారం)లో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్‌ను రద్దు చేస్తారు. అప్పుడు పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లను టీ20 ప్రపంచకప్‌ 2022 విజేతగా ప్రకటిస్తారు.

1992 వన్డే ప్రపంచకప్ ఫలితం రిపీట్ అవుతుందని పాకిస్తాన్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగగా.. ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీ ఫైనల్ కూడా చేరలేదు. సెమీ ఫైనల్‌కు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు చేరుకున్నాయి. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన పాక్ ఫైనల్ చేరింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచకప్ అందుకుంది. అప్పటి పరిస్థితులే ఇప్పుడు ఫైనల్ వరకు జరిగాయి. దాంతో పాక్ కప్ కొడుతుందని ఆ జట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: India Chokers: టీమిండియాను చోకర్స్‌ అని పిలవడంలో తప్పేమీ లేదు.. కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు!  

Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. ఇద్దరిని ఢీకొట్టిన ట్రక్.. ఒకరు మృతి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News