Mehidy Hasan No Balls: అరుదైన నోబాల్స్ వేసిన బంగ్లాదేశ్ బౌలర్.. టీమిండియాకు వరుసగా రెండు ఫ్రీహిట్స్!

BAN bowler Mehidy Hasan bowles bizzare No-Balls against IND. బంగ్లాదేశ్ బౌలర్ మెహదీ హసన్ అరుదైన నోబాల్స్ వేశాడు. ఈ వింత ఘటన భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో చోటుచేసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 8, 2022, 12:55 PM IST
  • అరుదైన నోబాల్స్ వేసిన బంగ్లాదేశ్ బౌలర్
  • టీమిండియాకు వరుసగా రెండు ఫ్రీహిట్స్
  • రెండో వన్డేలో భారత్ ఓటమి
Mehidy Hasan No Balls: అరుదైన నోబాల్స్ వేసిన బంగ్లాదేశ్ బౌలర్.. టీమిండియాకు వరుసగా రెండు ఫ్రీహిట్స్!

Bangladesh bowler Mehidy Hasan bowles Rare No-Balls in India vs Bangladesh 2nd ODI: క్రికెట్ ఆటలో నోబాల్స్ వేయడం సర్వసాధారణం. లైన్ నోబ్, హైట్ నోబ్, సైడ్ నోబ్ లాంటివి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లు తమ రన్నప్‌ను కంట్రోల్ చేసుకోలేక.. బౌలింగ్ చేసే సమయంలో క్రీజు దాటితే అంపైర్లు నోబాల్ ఇస్తారు. బౌలర్లు వేసిన బంతి నేరుగా బ్యాటర్ నడుం కన్నా ఎత్తులో వచ్చినా నోబాల్ ఇస్తారు. బంతి నేలను తాకి బ్యాటర్ తలపై నుంచి వెళ్లినా అంపైర్లు నోబాల్ ఇస్తారు. ఇవి కాకుండా భారత్, బంగ్లాదేశ్ మధ్య బుధవారం జరిగిన రెండో వన్డేలో ఓ అరుదైన నోబాల్ పడింది. 

భారత బ్యాటింగ్ చేస్తుండగా యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నాడు. మెహదీ హసన్ 21వ ఓవర్ వేశాడు. మొదటి నాలుగు బంతులు మెహదీ బాగానే వేశాడు. ఐదో బంతి వేసే సమయంలో తడబడిన మెహదీ.. బంతిని డెలివర్ చేసే సమయంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను ఒక్కసారిగా కాలితో తన్నేశాడు. దీంతో ఆ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. తర్వాతి బంతిని వేసేటప్పుడు కూడా మెహదీ తన కాలితో వికెట్లను తన్నాడు. దీంతో ఆ బంతి కూడా నోబాల్‌గా అంపైర్ ప్రకటించాడు. ఆ తర్వాతి బంతులను మాత్రం మెహదీ బాగానే వేశాడు.

తొలి నోబాల్‌కు వచ్చిన ఫ్రీహిట్‌ను శ్రేయాస్ అయ్యర్ వినియోగించుకోలేకపోయాడు. కేవలం సింగిల్ మాత్రమే తీశాడు. రెండో ఫ్రీహిట్‌కు ఫోర్ బాదాడు. మెహదీ హసన్ వేసిన అరుదైన నోబాల్స్‌కు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నోబాల్స్ చూసిన క్రికెట్ ఫాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. 'అరుదైన నోబాల్స్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇలాంటి నోబాల్స్ ఎప్పుడూ చూడలే' అని మరొకరు కామెంట్ చేశారు. ఫొటోస్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. 

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (82) టాప్‌ స్కోరర్‌ కాగా.. రోహిత్‌ శర్మ (51) హాఫ్ సెంచరీతో కడవరకు పోరాడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసింది. మెహిదీ హసన్ (100 నాటౌట్) సెంచరీ చేశాడు. 

Also Read: Himachal Pradesh Election Results 2022: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బోణీ.. సీఎం జైరాం ఠాకూర్‌ భారీ విజయం!  

Also Read: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. శ్రేయాస్, మెహదీ రేర్ రికార్డ్స్ ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News