సచిన్ కుమార్తెకి వేధింపులు.. ఒకరు అరెస్టు

గతకొద్ది రోజులుగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ను వేధిస్తున్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 

Last Updated : Jan 8, 2018, 01:12 PM IST
సచిన్ కుమార్తెకి వేధింపులు.. ఒకరు అరెస్టు

గతకొద్ది రోజులుగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ను వేధిస్తున్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి పేరు దేవ్ కుమార్ అని, ఇతడు పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందినవాడు అని పోలీసులు గుర్తించారు. సారాను వేధించడమే కాకుండా పెళ్లి చేసుకోకపోతే కిడ్నాప్ చేస్తానని నిందితుడు బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. సచిన్ కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు. 

నిందితుడు సారా ఇంటిలోని లాండ్ లైన్ నెంబర్‌ కు 20 సార్ట్లు ఫోన్ చేసాడని.. సారా గురించి అసభ్యంగా మాట్లాడాడని తెలిపారు. డిసెంబర్ 2 తేదిన  నిందుతుడు చివరిసారిగా ఫోన్ చేసి బెదిరించాడని దర్యాప్తులో తేలింది. డిసెంబర్ 5 న బాంద్రా పోలీస్ ఠాణాలో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కాగా.. నిందితుడి కుటుంబసభ్యులు అతడి మానసికస్థితి సరిగా లేదని చెప్పారు. పోలీసులు నిందితుడిని ముంబై తీసుకొని వచ్చి.. కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగా అతడికి సచిన్ నెంబర్ ఎలా తెలిసింది, నిజంగా అతడికి మానసిక పరిస్థితి బాగోలేదా? అన్నది విచారణలో తేలనుంది. 

Trending News