Mahela Jayawardene reveals his Dream T20 Team Top Five players: క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం ఇటీవల సాధారణం అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనే.. తన టీ20 జట్టులోని ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించాడు. ఇందులో భారత్ నుంచి ఒక ఆటగాడికి స్థానం దక్కింది. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లకే మహేళ చోటు కల్పించాడు.
ఐపీఎల్ 2022 కోసం మహేళ జయవర్దనే ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ ప్రజెంటర్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌తో వర్చువల్‌గా మాట్లాడిన జయవర్దనే తన డ్రీమ్ టీ20 జట్టులోని టాప్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు. మహేళ ఎంచుకున్న తన జట్టు కోసం పాకిస్తాన్ నుంచి ఇద్దరిని ఎంచుకోగా.. భారత్, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చాడు. వారిని టాప్ 5 ఆటగాళ్లుగా ఎంచుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాడు.
'టీ20 క్రికెట్‌లో బౌలర్లదే కీలక పాత్ర. రషీద్ ఖాన్ మంచి స్పిన్నర్. బ్యాటింగ్ కూడా చేయగలడు. అతడు ఏడు లేదంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. నా జట్టులో అతడు అగ్రస్థానంలో ఉంటాడు. జోస్ బట్లర్‌కు ఓపెనింగ్ చేయడం ఇష్టం. పేస్, స్పిన్ బాగా ఆడగలడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో యూఏఈలో కఠిన పరిస్థితులలో అద్భుతంగా ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్' అని మహేళ జయవర్దనే పేర్కొన్నాడు.
'షాహీన్ అఫ్రిది గత సంవత్సరం బాగా ఆడాడు. కొత్త బంతితో బాగా బౌలింగ్ చేస్తాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో బంతిని బాగా స్వింగ్ చేస్తాడు. అతను వికెట్ టేకింగ్ బౌలర్. మహ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్‌కు ఓపెనింగ్ చేస్తాడని అందరికీ తెలుసు. కానీ అతను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలడని నేను అనుకుంటున్నాను. అతను స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు' అని జయవర్దనే చెప్పుకొచ్చాడు. జయవర్దనే తన జట్టులో టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటివ్వలేదు.
జయవర్ధనే డ్రీమ్ టీ20 టీమ్ టాప్ 5 ప్లేయర్స్:
రషీద్ ఖాన్, జోస్ బట్లర్, జస్ప్రీత్ బుమ్రా, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్.
Also Read: SVP Trailer: 'సర్కారు వారి పాట' ట్రైలర్‌నూ వాడేసిన హైదరాబాద్ పోలీసులు!
Also Read: Giraffe Video: అయ్యో రాములా.. తిండి కోసం తిప్పలు పడుతున్న జిరాఫీ! భూమ్మీద గడ్డి తినడానికి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook