IND vs NED: నెదర్లాండ్స్‌పై భారత్ విజయం.. భారత్ ఖాతాలో 4 పాయింట్స్!

ICC T20 World Cup 2022 India vs Netherlands updates. టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో భారత్ విజయం సాధించింది.

Written by - P Sampath Kumar | Last Updated : Oct 27, 2022, 05:30 PM IST
  • ICC T20 World Cup 2022 India vs Netherlands updates. టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో భారత్ విజయం సాధించింది.
IND vs NED: నెదర్లాండ్స్‌పై భారత్ విజయం.. భారత్ ఖాతాలో 4 పాయింట్స్!
Live Blog

ICC T20 World Cup 2022 India vs Netherlands updates: టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా భారత్, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం అయింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ చిరస్మరణీయ విజయం అందుకుని రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు బంగ్లాపై ఓడిన నెదర్లాండ్స్‌.. పుంజుకోవాలని చూస్తోంది. క్వాలిఫయింగ్‌ టోర్నీలో సత్తాచాటి సూపర్‌ 12కు అర్హత సాధించిన నెదర్లాండ్స్‌.. పటిష్ట టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. 

27 October, 2022

  • 16:02 PM

    టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో భారత్ విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. దీంతో భారత్ 56 పరుగుల తేడాతో గెలిచింది. నెదర్లాండ్స్‌ బ్యాటర్లలో టిమ్ ప్రింగిల్ (20) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ ఖాతాలో 4 పాయింట్స్ చేరాయి. 

  • 15:38 PM

    17 ఓవర్లు: భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. దీంతో నెదర్లాండ్స్‌ స్కోరు 96/7. నెదర్లాండ్స్‌ విజయానికి ఇంకా 84 రన్స్ కావాలి. 
     

  • 15:36 PM

    నెదర్లాండ్స్‌ ఏడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి ఎడ్వర్డ్స్‌ క్యాచ్ ఔట్ అయ్యాడు. 
     

  • 15:34 PM

    16 ఓవర్లు: నెదర్లాండ్స్ స్కోరు 87-6. క్రీజ్‌లో లోగాన్ వాన్ బీక్ (0), ఎడ్వర్డ్స్‌ (5) ఉన్నారు. షమీ వేసిన ఈ ఓవర్లో 6 రన్స్ వచ్చాయి.  
     

  • 15:31 PM

    నెదర్లాండ్స్‌ ఆరో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన 16వ ఓవర్ నాలుగో బంతికి ప్రింగ్లే క్యాచ్ ఔట్ అయ్యాడు. 
     

  • 15:29 PM

    15 ఓవర్లు పూర్తి:
    15 ఓవర్లు పూర్తయ్యేసరికి నెదర్లాండ్స్‌ స్కోరు 81/5. క్రీజ్‌లో ప్రింగ్లే (16), ఎడ్వర్డ్స్‌ (3) ఉన్నారు. నెదర్లాండ్స్‌ విజయానికి ఇంకా 99 రన్స్ కావాలి. 

  • 15:25 PM

    14వ ఓవర్ ముగిసేసరికి నెదర్లాండ్స్ ఐదు వికెట్ల నష్టానికి 73 రన్స్ చేసింది. క్రీజ్‌లో ప్రింగ్లే (7), ఎడ్వర్డ్స్‌ (1) ఉన్నారు. నెదర్లాండ్స్ విజయానికి ఇంకా 107 పరుగులు అవసరం. 
     

  • 15:22 PM

    13 ఓవర్లు ముగిసేసరికి నెదర్లాండ్స్ స్కోరు 64/5. క్రీజ్‌లో ప్రింగ్లే (1), ఎడ్వర్డ్స్‌ (1) ఉన్నారు.
     

  • 15:21 PM

    ఒకే ఓవర్లో రెండు వికెట్స్:
    వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ మాయాజాలం చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టాడు. 12వ ఓవర్‌ మొదటి బంతికి కొలిన్‌ అకెర్మాన్,   నాలుగో బంతికి టామ్ కూపర్ ఔట్ అయ్యారు. 
     

  • 15:15 PM

    12 ఓవర్లు: అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో నెదర్లాండ్స్‌ స్కోరు 62/3. క్రీజ్‌లో కోలిన్ అకెర్మాన్ (17), టామ్ కూపర్ (9) ఉన్నారు. 
     

  • 15:12 PM

    11వ ఓవర్ ముగిసేసరికి నెదర్లాండ్స్ మూడు వికెట్ల నష్టానికి 56 రన్స్ చేసింది. క్రీజ్‌లో కోలిన్ అకెర్మాన్ (16), టామ్ కూపర్ (4) ఉన్నారు. ఈ ఓవర్లో అశ్విన్ 5 రన్స్ ఇచ్చాడు. 
     

  • 15:09 PM

    10 ఓవర్లు పూర్తి:
    సగం ఓవర్లు పూర్తయ్యేసరికి నెదర్లాండ్స్‌ స్కోరు 51/3. క్రీజ్‌లో కోలిన్ అకెర్మాన్ (13), టామ్ కూపర్ (3) ఉన్నారు. నెదర్లాండ్స్‌ విజయానికి ఇంకా  129 రన్స్ కావాలి. 

  • 15:06 PM

    అక్షర్ పటేల్ తిప్పేశాడు. రెండో వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. 10వ ఓవర్ రెండో బంతికి బాస్ డి లీడే (16)ను ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా సూపర్ క్యాచ్ అందుకున్నాడు. 
     

  • 15:02 PM

    9 ఓవర్లు: నెదర్లాండ్స్ స్కోరు 47/2. క్రీజ్‌లో కోలిన్ అకెర్మాన్ (12), బాస్ డి లీడే (16) ఉన్నారు. ఆర్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 6 రన్స్ వచ్చాయి.  
     

  • 14:59 PM

    8వ ఓవర్ ముగిసేసరికి నెదర్లాండ్స్ రెండు వికెట్ల నష్టానికి 41 రన్స్ చేసింది. క్రీజ్‌లో కోలిన్ అకెర్మాన్ (7), బాస్ డి లీడే (15) ఉన్నారు. 
     

  • 14:51 PM

    పవర్ ప్లే పూర్తి:
    పవర్ ప్లే పూర్తయ్యేసరికి నెదర్లాండ్స్‌ స్కోరు 27/2. క్రీజ్‌లో కోలిన్ అకెర్మాన్ (2), బాస్ డి లీడే (7) ఉన్నారు. మొహ్మద్ షమీ వేసిన 6వ ఓవర్లో 5 రన్స్ వచ్చాయి. 

  • 14:48 PM

    రెండో వికెట్: అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి మ్యాక్స్‌ ఓడౌడ్‌  (16) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 20 పరుగుల వద్ద నెదర్లాండ్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి నెదర్లాండ్స్‌ స్కోరు 22-2. 
     

  • 14:45 PM

    ఓపెనర్‌ మ్యాక్స్‌ దూకుడుగా ఆడుతున్నాడు. మొహ్మద్ షమీ వేసిన నాలుగో ఓవర్‌లో ఫోర్ కొట్టాడు. నెదర్లాండ్స్ స్కోరు 19/1. క్రీజ్‌లో మ్యాక్స్‌ (16), లీడె (1) ఉన్నారు.
     

  • 14:39 PM

    టీమిండియాకు భువనేశ్వర్ బ్రేక్ ఇచ్చాడు. మొదటి మెయిడెన్ చేసి భూవీ.. రెండో ఓవర్‌  కూడా మెయిడ్ వేశాడు. మూడో బంతికి ఓపెనర్ విక్రమజీత్ (1)ను పెవిలియన్‌కు పంపించాడు. 
     

  • 14:36 PM

    రెండో ఓవర్‌లో నెదర్లాండ్స్‌ ఓపెనర్ ఒడౌడ్ రెండు బౌండరీలు బాదడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి.

  • 14:32 PM

    180 పరుగుల లక్ష్యంతో నెదర్లాండ్స్‌ బరిలోకి దిగింది. మొదటి ఓవర్ భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ ఓవర్ వేశాడు.
     

  • 14:16 PM

    ముగిసిన భారత్ ఇన్నింగ్స్: 
    భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. దాంతో నెదర్లాండ్స్‌ ముందు 180 పరుగులు లక్ష్యం ఉంది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ (62), రోహిత్ శర్మ (53) హాఫ్ సెంచరీలు బాదారు. సూర్యకుమార్ యాదవ్ (51) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ తలో వికెట్ పడగొట్టారు. 
     

  • 14:09 PM

    19వ ఓవర్ ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (54), సూర్యకుమార్ యాదవ్ (42) ఉన్నారు. 
     

  • 14:04 PM

    18 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 154 రన్స్ మాత్రమే చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (53), సూర్యకుమార్ యాదవ్ (35) ఉన్నారు. ఈ ఓవర్లో 10 రన్స్ వచ్చాయి. 
     

  • 14:00 PM

    కోహ్లీ హాఫ్ సెంచరీ: 
    17 ఓవర్ పూర్తయ్యేసరికి భారత్‌ స్కోరు 144-2. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (51), సూర్యకుమార్ యాదవ్ (27) ఉన్నారు. ఈ ఓవర్లో కోహ్లీ ఫోర్, సిక్స్ బాదాడు. దాంతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.   
     

  • 13:54 PM

    మూడు ఫోర్లు: 
    16వ ఓవర్ ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 128 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (37), సూర్యకుమార్ యాదవ్ (26) ఉన్నారు. బాస్ డి లీడే వేసిన ఈ ఓవర్లో సూర్య రెండు ఫోర్లు బాదగా.. కోహ్లీ ఓ ఫోర్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్లో 14 రన్స్ వచ్చాయి. 

  • 13:50 PM

    15 ఓవర్లు పూర్తి:

    15 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 114 రన్స్ మాత్రమే చేసింది. నెదర్లాండ్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దాంతో భారత బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టాలు పడుతున్నారు. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (32), సూర్యకుమార్ యాదవ్ (17) ఉన్నారు. 

  • 13:44 PM

    సూర్యకుమార్ రెండు ఫోర్లు: 
    14వ ఓవర్ ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 106 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (29), సూర్యకుమార్ యాదవ్ (12) ఉన్నారు. వాన్ మీకెరెన్ వేసిన ఈ ఓవర్లో సూర్య రెండు ఫోర్లు బాదాడు. మొత్తంగా ఈ ఓవర్లో 11 రన్స్ వచ్చాయి. 
     

  • 13:40 PM

    13 ఓవర్లు పూర్తి: భారత్‌ స్కోరు 96/2. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (27), సూర్యకుమార్ యాదవ్ (3) ఉన్నారు. 
     

  • 13:37 PM

    రోహిత్ శర్మ ఔట్:
    ఫ్రెడ్ క్లాసెన్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ (53) ఔటయ్యాడు. భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 84 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 
     

  • 13:36 PM

    12వ ఓవర్ ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 84రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (19), సూర్యకుమార్ యాదవ్ (0) ఉన్నారు. 
     

  • 13:32 PM

    రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ:
    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ బాదాడు. టిమ్ ప్రింగిల్ వేసిన 11వ ఓవర్ 5వ బంతికి ఫోర్ బాదిన రోహిత్.. ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 78/1. 
     

  • 13:25 PM

    10 ఓవర్లు పూర్తి: భారత్‌ స్కోరు 67/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (42), విరాట్ కోహ్లీ (14) ఉన్నారు. బాస్ డి లీడే వేసిన ఈ ఓవర్లో రోహిత్ శర్మ ఫోర్, సిక్స్ బాదాడు. ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.  
     

  • 13:20 PM

    తొమ్మిదో ఓవర్ పూర్తయ్యేసరికి భారత్‌ స్కోరు 53/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (30), విరాట్ కోహ్లీ (13) ఉన్నారు. 
     

  • 13:19 PM

    రివ్యూ తీసుకున్న రోహిత్ శర్మ:
    వాన్ బీక్ వేసిన 8వ ఓవర్ ఐదవ బంతికి రోహిత్ శర్మ షాట్ ఆడగా.. ఎల్బీ కోసం నెదర్లాండ్స్‌ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు. వెంటనే రోహిత్ రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు. రిప్లైలో బంతి బ్యాట్ తాకుతూ వెళ్ళింది. 

  • 13:17 PM

    ఎనిమిదో ఓవర్ ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 48 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (28), విరాట్ కోహ్లీ (10) ఉన్నారు. 
     

  • 13:14 PM

    రోహిత్ భారీ సిక్స్:
    8వ ఓవర్ నాలుగో బంతికి రోహిత్ శర్మ 88 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. 
     

  • 13:11 PM

    7 ఓవర్లు పూర్తి: భారత్‌ స్కోరు 38/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (20), విరాట్ కోహ్లీ (8) ఉన్నారు. టిమ్ ప్రింగిల్ కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు.
     

  • 13:09 PM

    పవర్ ప్లే పూర్తి:
    పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 32 రన్స్ మాత్రమే చేసింది. నెదర్లాండ్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టాలు పడుతున్నారు. 

  • 13:06 PM

    రోహిత్ శర్మకు లైఫ్:
    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు లైఫ్ లభించింది. క్లాసెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించగా.. ఫీల్డర్‌ ప్రింగ్లే సునాయాస క్యాచ్‌ను విడిచాడు.
     

  • 13:03 PM

    5 ఓవర్లు పూర్తి: భారత్‌ స్కోరు 28/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (3) ఉన్నారు. ఫ్రెడ్ క్లాసెన్ కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 

  • 13:01 PM

    నాలుగో ఓవర్ ముగిసేసరికి భారత్ ఓక్ వికెట్ నష్టానికి 23 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (2) ఉన్నారు. 
     

  • 12:58 PM

    మూడో ఓవర్ పూర్తయ్యేసరికి భారత్‌ స్కోరు 18/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (1) ఉన్నారు. 
     

  • 12:56 PM

    ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) మళ్లీ నిరాశపరిచాడు. వాన్ మీకెరెన్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. 
     

Trending News