IND vs BAN Updates: చివరి బంతి వరకు ఉత్కంఠ.. బంగ్లాపై భారత్ విజయం!

ICC T20 World Cup 2022 India vs Bangladesh Cricket Match updates. చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచులో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. 

Written by - P Sampath Kumar | Last Updated : Nov 2, 2022, 06:04 PM IST
  • IND vs BAN Cricket Score: ICC T20 World Cup 2022 India vs Bangladesh Cricket Score updates and Live Streaming. చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచులో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా బంగ్లా లక్ష్యం 16 ఓవర్లకు 151 పరుగులుగా మారింది. ఛేదనలో బంగ్లా 6 వికెట్స్ కోల్పోయి 145 రన్స్ చేసి.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
IND vs BAN Updates: చివరి బంతి వరకు ఉత్కంఠ.. బంగ్లాపై భారత్ విజయం!
Live Blog

IND vs BAN Live Cricket Score Updates: చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచులో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా బంగ్లా లక్ష్యం 16 ఓవర్లకు 151 పరుగులుగా మారింది. ఛేదనలో బంగ్లా 6 వికెట్స్ కోల్పోయి 145 రన్స్ చేసి.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

2 November, 2022

  • 17:54 PM

    చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచులో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా బంగ్లా లక్ష్యం 16 ఓవర్లకు 151 పరుగులుగా మారింది. ఛేదనలో బంగ్లా 6 వికెట్స్ కోల్పోయి 145 రన్స్ చేసి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్‌ సింగ్ 14 పరుగులు ఇచ్చాడు. లిటన్‌ దాస్‌ (60) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ హార్దిక్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. 
     

  • 17:40 PM

    15 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 131/6. తస్కిన్ అహ్మద్ (11), నురుల్ హసన్ (12) క్రీజులో ఉన్నారు. బంగ్లా విజయానికి 6 బంతుల్లో 20 రన్స్ అవసరం. 
     

  • 17:34 PM

    14వ ఓవర్ ముగిసేసరికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 120 రన్స్ చేసింది. తస్కిన్ అహ్మద్ (0), నురుల్ హసన్ (12) క్రీజులో ఉన్నారు. బంగ్లా విజయానికి 12 బంతుల్లో 31 రన్స్ అవసరం. 
     

  • 17:27 PM

    13 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 108/6. తస్కిన్ అహ్మద్ (0), నురుల్ హసన్ (2) క్రీజులో ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఈ ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టాడు. బంగ్లా విజయానికి 18 బంతుల్లో 43 రన్స్ అవసరం. 
     

  • 17:21 PM

    షకీబ్ ఔట్:
    బంగ్లాదేశ్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ వేసిన 12వ ఓవర్ ఐదవ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీపక్ హుడా అద్భుత క్యాచ్ అందుకున్నాడు. బంగ్లాదేశ్‌ స్కోర్ 101/4. 

  • 17:13 PM

    11వ ఓవర్ ముగిసేసరికి బంగ్లాదేశ్‌ రెండు వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది. షకీబ్ (13), హుస్సేన్ (3) క్రీజులో ఉన్నారు. బంగ్లా విజయానికి 30 బంతుల్లో 52 రన్స్ అవసరం. 
     

  • 17:10 PM

    10 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 88-2. షకీబ్ (9), హుస్సేన్ (2) క్రీజులో ఉన్నారు. బంగ్లా విజయానికి 36 బంతుల్లో 63 రన్స్ అవసరం. 
     

  • 17:05 PM

    షాంటో ఔట్:
    బంగ్లాదేశ్‌ రెండో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన 10వ ఓవర్ మొదటి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. రాహుల్ అద్భుత రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. 

  • 17:03 PM

    9వ ఓవర్ ముగిసేసరికి బంగ్లాదేశ్‌ రెండు వికెట్ల నష్టానికి 84 రన్స్ చేసింది. షకీబ్ (3), షాంటో (21) క్రీజులో ఉన్నారు.
     

  • 16:59 PM

    8 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 74-1. షకీబ్ (1), షాంటో (13) క్రీజులో ఉన్నారు.
     

  • 16:57 PM

    హమ్మయ్య దాస్ ఔట్:
    హాఫ్ సెంచరీ హీరో లిటన్‌ దాస్‌ రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ డైరెక్ట్ హిట్ కారణంగా దాస్ పెవిలియన్ చేరాడు. 

  • 16:51 PM

    54 బంతుల్లో 85 రన్స్:
    బంగ్లా విజయం సాధించాలంటే.. ఇంకా 54 బంతుల్లో 85 రన్స్ కొట్టాలి. 

  • 16:51 PM

    ఆరంభమయిన మ్యాచ్.. 8వ ఓవర్ వేస్తున్న అశ్విన్. 
     

  • 16:47 PM

    మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. బంగ్లా లక్ష్యం 16 ఓవర్లకు 151. 
     

  • 16:33 PM

    ఓవర్ల పరంగా బంగ్లాదేశ్‌ టార్గెట్‌:
    19 ఓవర్లు: 177
    17 ఓవర్లు: 160
    15 ఓవర్లు: 142
    12 ఓవర్లు: 112
    10 ఓవర్లు: 89

  • 16:32 PM

    భారత అభిమానులకు శుభవార్త. అడిలైడ్‌లో వర్షం తగ్గింది. మైదాన సిబ్బంది తమ పనులతో బిజీగా ఉన్నారు. 
     

  • 16:20 PM

    ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే అడిలైడ్‌లో దట్టంగా మేఘాలు అలుకున్నాయి. అడిలైడ్‌ పరిస్థితుల నేపథ్యంలో భారత డగౌట్‌లో ప్లేయర్స్ ఆందోళన చెందుతున్నారు. 
     

  • 16:07 PM

    17 పరుగులు ముందు:
    బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు పూర్తయిన నేపథ్యంలో డక్ వర్త్ లూయిస్ పద్ధతి వర్తిస్తుంది. ప్రస్తుతం భారత్ స్కోర్ కంటే బంగ్లా 17 పరుగులు ముందు ఉంది. మ్యాచ్ జరగకుంటే.. బంగ్లా విజయం సాధిస్తుంది. 
     

  • 16:03 PM

    వర్షం అంతరాయం:
    భారత్, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. బంగ్లా ఇన్నింగ్స్ 7వ ఓవర్ పూర్తవ్వగానే చిరు జల్లు కురిసింది. దాంతో మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. 

  • 15:59 PM

    7 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 66/0. లిటన్‌ దాస్‌ (59), షాంటో (7) క్రీజులో ఉన్నారు.
     

  • 15:56 PM

    పవర్ ప్లే పూర్తి: 
    6 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్‌ వికెట్ కోల్పోకుండా 60 పరుగులు చేసింది. క్రీజ్‌లో లిటన్‌ దాస్‌ (56), షాంటో (4) ఉన్నారు. 
     

  • 15:54 PM

    మెరుపు హాఫ్ సెంచరీ:
    బంగ్లాదేశ్‌ ఓపెనర్ లిటన్‌ దాస్‌ మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 21 బంతుల్లో 50 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 
     

  • 15:52 PM

    లిటన్‌ సిక్స్:
    భువనేశ్వర్ కుమార్ వేసిన 5వ ఓవర్ ఐదో బంతికి లిటన్‌ దాస్‌ సిక్స్ బాదాడు. బంగ్లాదేశ్‌ స్కోర్ 44/0. లిటన్‌ దాస్‌ (41), షాంటో (3) క్రీజులో ఉన్నారు.

  • 15:46 PM

    4 ఓవర్లు పూర్తి: బంగ్లాదేశ్‌ స్కోర్ 35/0. లిటన్‌ దాస్‌ (33), షాంటో (2) క్రీజులో ఉన్నారు.
     

  • 15:41 PM

    భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్‌లో లిటన్ దాస్ మరింత రెచ్చిపోయాడు. సిక్స్‌తో పాటు రెండు కొట్టడంతో మొత్తం ఈ ఓవర్‌లో 16 రన్స్ వచ్చాయి. స్కోరు: 3 ఓవర్లలో 30/3.

  • 15:32 PM

    రెండో ఓవర్‌లో ఓపెనర్ లిటన్ దాస్ బ్యాట్ ఝులిపించాడు. మూడు ఫోర్లు బాదడంతో 12 పరుగులు వచ్చాయి.
     

  • 15:31 PM

    185 పరుగుల లక్ష్యంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగింది. భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి ఓవర్‌లో రెండు పరుగులు వచ్చాయి.
     

  • 15:18 PM

    బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో బీహార్ 6 వికెట్లు కోల్పోయి 184 రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ముందు 185 పరుగుల లక్ష్యంను ఉంచింది. విరాట్ కోహ్లీ (64 నాటౌట్; 44 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (50; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీలు బాదారు. సూర్యకుమార్ యాదవ్ (30) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ 3 వికెట్స్ పడగొట్టాడు. 
     

  • 15:10 PM

    19వ ఓవర్ ముగిసేసరికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (61), ఆర్ అశ్విన్ (2) ఉన్నాడు . 
     

  • 15:06 PM

    అక్షర్ పటేల్ ఔట్:
    అక్షర్ పటేల్ (7) ఔట్ అయ్యాడు. హసన్ మహమూద్ వేసిన 19వ ఓవర్ మొదటి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 

  • 15:04 PM

    18 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 157/5. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (50), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. 
     

  • 15:01 PM

    దినేష్ కార్తీక్ ఔట్:
    దినేష్ కార్తీక్ (7) ఔట్ అయ్యాడు. షారిఫుల్ ఇస్లాం వేసిన 17వ ఓవర్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. 

  • 14:59 PM

    17వ ఓవర్ ముగిసేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (50) ఉన్నాడు . 
     

  • 14:53 PM

    16 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 140/4. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (46), దినేష్ కార్తీక్ (2) ఉన్నారు. 
     

  • 14:42 PM

    టీమిండియాకు బంగ్లా కెప్టెన్ షకీబ్ మరోసారి షాక్ ఇచ్చాడు. కుదురుకున్న సూర్య కుమార్ యాదవ్ (30) క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 ఓవర్లకు 119-3. 

  • 14:42 PM

    15వ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ (40), హర్ధిక్ పాండ్యా (5) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.
     

  • 14:35 PM

    విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్ నిలకడగా ఆడుతున్నారు. 13వ ఓవర్ సూర్య మూడు ఫోర్లు బాదడంతో 14 పరుగులు వచ్చాయి. స్కోరు: 13 ఓవర్లకు 115-2. 

  • 14:34 PM

    12వ ఓవర్‌లో టీమిండియా స్కోరు బోర్డు వంద దాటింది. ఈ ఓవర్‌లో మొత్తం 9 పరుగులు వచ్చాయి.

  • 14:31 PM

    టీమిండియా జోరు కాస్త తగ్గింది. 11వ ఓవర్‌లో కేవలం ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి.
     

  • 14:24 PM

    10 ఓవర్లు పూర్తి: భారత్ స్కోర్ 86-2. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (7), విరాట్ కోహ్లీ (24) ఉన్నారు. 
     

  • 14:19 PM

    కోహ్లీ ఫోర్, రాహుల్ సిక్సులు:
    షారిఫుల్ ఇస్లాం వేసిన 9 ఓవర్ మొదటి బంతికి విరాట్ కోహ్లీ బౌండరీ బాదాడు. నాలుగో బంతికి రాహుల్ సిక్సులు బాదాడు. భారత్ స్కోర్ 76-1. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (48), విరాట్ కోహ్లీ (23) ఉన్నారు. 
     

Trending News