Gambhir- Sreesanth: మైదానంలో గొడ‌వ ప‌డ్డ శ్రీశాంత్, గంభీర్... వైరల్ అవుతున్న వీడియో..

Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్‌ క్రికెట్ లో టీమిండియా మాజీ క్రికెట‌ర్లు గౌత‌మ్ గంభీర్‌, శ్రీశాంత్ గొడ‌వ‌ప‌డ్డారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2023, 01:15 PM IST
Gambhir- Sreesanth: మైదానంలో గొడ‌వ ప‌డ్డ శ్రీశాంత్, గంభీర్... వైరల్ అవుతున్న వీడియో..

Gautam Gambhir-Sreesanth Controversy: లెజెండ్స్ లీగ్‌ క్రికెట్(Legends League Cricket 2023)లో భాగంగా బుధవారం ఇండియా క్యాపిట‌ల్స్‌, గుజ‌రాత్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్లు గౌత‌మ్ గంభీర్‌(Gautam Gambhir), శ్రీశాంత్ (Sreesanth) మైదానంలో గొడవపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

అసలేం జరిగిందంటే..
గుజ‌రాత్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా క్యాపిట‌ల్స్(India Capitals) త‌ర‌ఫున ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగాడు గంబీర్. జెయింట్స్ బౌల‌ర్ శ్రీ‌శాంత్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్లో గౌతీ వ‌రుస‌గా సిక్స్‌, ఫోర్ బాదాడు. తర్వాత బాల్ ను శ్రీశాంత్ వైడ్ గా వేసినప్పటికీ గంబీర్ దానిని ఆడాడు. అయితే రన్ రాలేదు. ఈ క్రమంలో శ్రీశాంత్, గంబీర్ ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత కూడా గంభీర్ అతడితో గొడవపడినట్లు తెలుస్తోంది. అంపైర్లు, సహచర క్రికెటర్లు క‌లుగ‌జేసుకొని ఇద్ద‌రికీ స‌ర్ది చెప్పడంతో ఆ వివాదం అంతటితో సద్దుమణిగింది. గంభీర్ హాఫ్ సెంచరీతో సాధించడంతో క్యాపిటల్స్ సులభంగా జెయింట్స్ పై గెలుపొందింది. 

తాజాగా ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు శ్రీశాంత్. గంభీర్ త‌న‌తో ప్రవర్తించిన తీరు సరిగా లేదని.. తనను ప‌దే అన‌కూడ‌డ‌ని మాట‌ల‌తో కించ‌ప‌రిచాడ‌ని శ్రీశాంత్ చెప్పాడు. ఈ వివాదంలో తనదే తప్పును కొందరు అంటున్నారని.. వారికి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో పోస్ట్ చేశానని అతడు బదులిచ్చాడు. శ్రీకాంత్ చేసిన కామెంట్స్ నెట్టింట పెనుదుమారమే రేపుతున్నాయి. 

Also Read: BAN vs NZ 2nd Test: ఇవే తగ్గించుకుంటే మంచిది..! విచిత్రంగా ఔటైన బంగ్లా సీనియర్ బ్యాట్స్‌మెన్.. వీడియో ఇదిగో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News