Kohli On First-Ball Ducks: గోల్డెన్‌ డకౌట్స్‌ పై కోహ్లీ జోకులు, విమర్శలను పట్టించుకోనని వెల్లడి (వీడియో)

Kohli On First-Ball Ducks: విరాట్‌ కోహ్లీ తన పర్ఫామెన్స్‌ పై ఆర్సీబీ ఇన్‌ సైడర్‌ ఇంటర్వ్యూలో స్పందించాడు. గోల్డెన్‌ డకౌట్స్‌ పై వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 12:04 PM IST
  • ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మూడుసార్లు గోల్డెన్‌ డకౌట్‌ అయిన కోహ్లీ
  • గోల్డెన్‌ డకౌట్స్‌ పై విమర్శలను పట్టించుకోనన్న రన్‌ మెషీన్‌
  • ఆర్సీబీ ఇన్‌ సైడర్‌ ఇంటర్వ్యూలో చెప్పిన విరాట్‌ కోహ్లీ
 Kohli On First-Ball Ducks: గోల్డెన్‌ డకౌట్స్‌ పై కోహ్లీ జోకులు, విమర్శలను పట్టించుకోనని వెల్లడి (వీడియో)

Kohli On First-Ball Ducks: ఐపీఎల్‌ లో లీగ్‌ దశ మ్యాచ్‌ లు ముగిసే సమయం ఆసన్నమైంది. అయితే ఇప్పటివరకు  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆడిన 12 మ్యాచుల్లో ఏడు విజయాలు సాధించింది. దీంతో 14 పాయింట్లతో టేబుల్‌ లో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ సీజన్‌ లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు కోహ్లీ ఆడిన 12 మ్యాచుల్లో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ ఉంది. ఆర్సీబీ ఇన్‌ సైడర్‌ పేరుతో నాగ్‌(దానిష్‌ సైత్‌) కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో కోహ్లీ తన పర్ఫామెన్స్‌ పై వస్తున్న విమర్శలను జోకులుగా మలిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

కోహ్లీ ఐపీఎల్‌ సీజన్‌ లో ఇప్పటివరకు ఆరు సార్లు గోల్డెన్‌ డక్‌ ఔట్‌ అయ్యాడు. ఇప్పటికే జరిగిన 14 ఎడిషన్లలో కోహ్లీ మూడుసార్లు మాత్రమే గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. అయితే ఈ సీజన్‌లో మాత్రమే మరో మూడు సార్లు డకౌట్‌ గా వెనుదిరిగాడు రన్‌ మెషీన్‌. ఇందులో రెండు సార్లు కూడా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో ఒక్కసారి లక్నో సూపర్‌ జెయింట్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో కోహ్లీ ఈ చెత్తరికార్డును సొంతం చేసుకున్నాడు. 

మే 8న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌ లో కోహ్లీ ఫస్ట్‌ బాల్‌ కే ఔట్‌ అయ్యాడు.  లెఫ్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ జగదీశ సుచిత్‌ బౌలింగ్‌ లో విలిమయ్సన్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. అంతకుముందు ఏప్రిల్ 23న ఇదే హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌ లోనూ విరాట్‌ డకౌట్‌ అయ్యాడు. అది కూడా ఫస్ట్‌ బాల్‌కే. మార్కో జాన్సన్‌ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికి కోహ్లీ స్లిప్ లో ఉన్న మార్కరంకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత చిన్న వంకరనవ్వుతో డ్రెస్సింగ్‌ రూంకు వెళ్లాడు. అంతకుముందు ఏప్రిల్‌ 19 లక్నో సూపర్‌ జెయింట్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లోనూ కోహ్లీ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. దుష్మంత చమీరా బౌలింగ్‌ లో కోహ్లీ ఫస్ట్‌ బాల్‌ కే దీపక్‌ హూడా చేతికి చిక్కి ఔటయ్యాడు.

ఈ గోల్డెన్‌ డకౌట్స్‌ పై ఆర్సీబీ ఇన్‌ సైడర్‌ ఇంటర్వ్యూలో నాగ్‌ కోహ్లీకి ప్రశ్నలు సంధించాడు. మీరు పెట్స్‌ ను ఇష్టపడుతారని విన్నాను అనగానే కోహ్లీ అవును అని సమాధానం చెప్తాడు. ఆ తర్వాత మీ ఇంట్లో ఎన్ని పెట్స్‌ ఉన్నాయి అన్న ప్రశ్నకు కోహ్లీ.. వాటిని చూసుకునే సమయం లేకపోవడంతో పెంచుకోవడం లేదని చెప్తాడు. అప్పుడు ఇంటర్వ్యూయర్‌ రీసెంట్‌ గా మీకు రెండు డక్స్‌ వచ్చాయని చెప్తాడు. దానికి కోహ్లీ నవ్వుతూ తన కేరీర్‌ లో ఎప్పుడు ఇలా కాలేదని చెప్తాడు. అటు గోల్డెన్‌ డకౌట్స్‌ పై వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోనని చెప్పాడు కోహ్లీ.  మొత్తంగా శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌ తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌ లోనైనా భారీ స్కోరు సాధిస్తాడని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also Read:Guru Gochar 2022: గురుగ్రహ సంచారం వల్ల ఈ 3 రాశులకు శుభకాలం!

Also Read:Pandit Sukh Ram Passes Away: కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News