KL Rahul Said Captain Rohit Sharma was clear about my Batting position: గురువారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. 216 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి 43.2 ఓవర్లలో విజయం సాదించింది. భారత్ విజయంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (64 నాటౌట్: 103 బంతుల్లో 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా (36), అక్షర్ పటేల్ (21) రాహుల్‌కు సహకరించారు. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకొంది. బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలించిన ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది.
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గతంలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు జోడీగా ఓపెనర్‌గా వచ్చేవాడు. అయితే ఇటీవల కాలంలో మాత్రం మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మూడో వన్డే మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ స్థానంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంతో నా ఆటతీరును ఉత్తమంగా అర్థం చేసుకోగలగుతున్నా. మిడిల ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం వల్ల స్పిన్ బౌలింగ్ ఎటాక్‌ను ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాట్ మీదకు బంతి వస్తుంటే.. ఆడటం నాకు చాలా చాలా ఇష్టం. కెప్టెన్ రోహిత్ శర్మ నా విషయంలో స్పష్టతతో ఉన్నాడు' అని రాహుల్ తెలిపాడు.
'కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయాలని చెప్పాడు. దీంతో నేనేం చేయగలనో అది చేసేందుకు ప్రయత్నించా. ఐదో స్థానంలో క్రీజ్‌లోకి రావడం వల్ల మ్యాచ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకొనే వీలుంటుంది. అయితే జట్టుకు నా అవసరం ఏంటనేది నేను ఎప్పుడూ ఆలోచిస్తా. ఈడెన్ గార్డెన్స్ మైదానం ఫ్లాట్‌గా ఉందని చెప్పను. శ్రీలంక ప్రారంభం చూసి కచ్చితంగా 280-300 పరుగులు చేస్తారని భావించా. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లంకను కట్టడి చేశారు. శ్రీలంక బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేసి తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాల సహకారంతో మంచి భాగస్వామ్యాలు నిర్మించాను. చివరికి విజయం సాధించడం ఆనందంగా ఉంది' అని కేఎల్ రాహుల్ చెప్పాడు.
'తొలి వన్డేలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు బాగా ఆడారు. దాంతో మేం కూడా దూకుడుగా ఆడాల్సి వచ్చింది. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం త్వరగా వికెట్లు కోల్పోవడంతో.. నిదానంగా బ్యాటింగ్ చేశాం. ఒకవేళ 280-300 లక్ష్యం ఉంటే దానికనుగుణంగా మేం కూడా దూకుడు పెంచేవాళ్లం' అని కేఎల్ రాహుల్ (KL Rahul) చెప్పుకొచ్చాడు. భారత్, శ్రీలంక (IND vs SL) జట్ల మధ్య చివరి వన్డే జనవరి 15 (ఆదివారం)న తిరువనంతపురంలో జరగనుంది. ఈ వన్డే కూడా గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది.
Also Read: Shirdi Bus Accident: షిరిడీ యాత్రకు వెళుతూ తిరిగిరాని లోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
Also Read: Balakrishna Fans Arrested: వీర సింహా రెడ్డి థియేటర్ వద్ద అత్యుత్సాహం..10 మంది బాలయ్య ఫాన్స్ అరెస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook