ఐపీఎల్ 11లో విలియమ్సన్ సూపర్ రికార్డు

ఐపీఎల్ 11లో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఓ సూపర్ డూపర్ రికార్డును నమోదు చేశాడు.

Last Updated : May 27, 2018, 08:58 PM IST
ఐపీఎల్ 11లో విలియమ్సన్ సూపర్ రికార్డు

ఐపీఎల్ 11లో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఓ సూపర్ డూపర్ రికార్డును నమోదు చేశాడు. ఈసారి ఐపీఎల్ సీజనులో 700లకు పైగా రన్స్ చేసిన అయిదవ సూపర్ బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డును విలియమ్‌సన్ నమోదు చేశాడు. గతంలో ఇదే రికార్డును క్రిస్ గేల్, మైక్ హస్సీ, డేవిడ్ వార్నర్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా సాధించాడు.

వారి సరసన ఇప్పుడు  విలియమ్‌సన్ కూడా చేరాడు. కాగా.. ఫైనల్ మ్యాచ్‌‌లో అర్ధ సెంచరీ దిశగా పయనిస్తున్న  కేన్‌ విలియమ్సన్‌ (47; 36బంతుల్లో 5×4, 2×6)ను కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో ఎంఎస్ ధోనీ స్టంప్‌ ఔట్‌ చేయడం గమనార్హం. ఈ సీజనులో విలియమ్‌సన్ 735 పరుగులు చేసిన ఆరేంజ్ క్యాప్ కూడా చేజిక్కించుకోవడం విశేషం. 

Trending News