IPL Latest Updates: ఐపీఎల్‌లో పంజాబ్ తరుపున ఆడుతున్న సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడా టీ20 ఫార్మాట్‌లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వికెట్ తీయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. 146 మ్యాచ్‌ల్లో రబాడా ఈ ఘనత సాధించాడు.
టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రికార్డు ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ ఖాన్ కేవలం 134 మ్యాచ్‌ల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు. రషీద్ ఖాన్ తర్వాత పాక్ స్పిన్నర్ సయిద్ అజ్మల్ రెండో స్థానంలో ఉన్నాడు. అజ్మల్ 134 మ్యాచ్‌ల్లో ఈ మార్క్‌ను అందుకున్నాడు. మూడో స్థానంలో రబాడా ఉండగా... నాలుగో స్థానంలో ఉమర్ గుల్, మలింగ ఉన్నారు.
ఇక నిన్నటి మ్యాచ్‌లో కగిసో రబాడా అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రిషి ధావన్, చహర్ చెరో రెండు వికెట్లు తీశారు. బ్యాట్స్‌మెన్, బౌలర్స్ సమిష్టిగా రాణించడంతో బెంగళూరుపై పంజాబ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
బెయిన్‌స్టో (66), లివింగ్‌స్టోన్ (70) పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో కేవలం 9 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులే చేసింది. దీంతో 54 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి... ఆరింట ఓడిన పంజాబ్.. మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కి చేరే అవకాశం ఉంటుంది.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధరలు...
Also Read: Also Read: Horoscope Today May 14 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఆ రాశి వారి ఇంటికి అనుకోని అతిథి రావొచ్చు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
IPL Kagiso Rabadad: టీ20 ఫార్మాట్‌లో 200 వికెట్ల క్లబ్‌లోకి... పంజాబ్ బౌలర్ రబాడా రికార్డ్...
ఐపీఎల్ లేటెస్ట్ అప్‌డేట్స్
పంజాబ్ బౌలర్ కగిసో రబాడా కొత్త రికార్డు
టీ20 ఫార్మాట్‌లో 200 వికెట్ల క్లబ్‌లో చేరిన రబాడా
అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన మూడో బౌలర్