Ishan Kishan: ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీకి ముందు కోహ్లీతో చెప్పిన మాట ఇదే..

Ishan Kishan Interview To Shubman Gill: ఇషాన్ కిషన్ పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతుంది. ఒక్క ఇన్నింగ్స్‌తో ఈ యంగ్ క్రికెటర్ దిగ్గజాల సరసన చేరాడు. డబుల్ సెంచరీ మార్క్ చేరుకునే ముందు కోహ్లీతో తాను చెప్పిన మాటలను బయటపెట్టాడు ఇషాన్ కిషన్.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2022, 01:49 PM IST
  • బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించిన ఇషాన్ కిషన్
  • 190 పరుగుల వద్ద టెన్షన్
  • కోహ్లీతో మాట్లాడిన తరువాత డబుల్ సెంచరీ
Ishan Kishan: ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీకి ముందు కోహ్లీతో చెప్పిన మాట ఇదే..

Ishan Kishan Interview To Shubman Gill: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 290 పరుగులు జోడించాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో కిషన్‌కి టీమ్‌ ఇండియాలో చోటు దక్కడంతో పాటు తానేంటో నిరూపించుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేశాడు. చిట్టగాంగ్‌లో జరిగిన మ్యాచ్‌లో కిషన్ ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. రోహిత్ శర్మ గైర్హాజరీతో టీమ్‌లోకి వచ్చిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ ఒక్క ఇన్నింగ్స్‌తోనే తన సత్తా నిరూపించుకున్నాడు. 

ఇషాన్ కిషన్ 190 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భయపడ్డాడా..? విరాట్ కోహ్లి అతడితో ఏం చెప్పాడు..? కోహ్లీ, ఇషాన్ కిషన్‌లు క్రీజ్‌లో ఏం మాట్లాడుకున్నారు..? అనే ప్రశ్నలకు చాలా మంది క్రికెట్ ప్రేమికులు సమాధానం తెలుసుకోవాలనుంటున్నారు. వీటన్నింటికి సమాధానం ఇచ్చాడు ఇషాన్ కిషన్. మ్యాచ్ ముగిసిన తర్వాత కిషన్‌ను శుభ్‌మన్ గిల్  ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. కిషన్ తన డబుల్ సెంచరీని కేవలం 126 బంతుల్లో పూర్తి చేశాడు. ఇది వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ.

ఈ సందర్భంగా ఇషాన్ మాట్లాడుతూ.. 'సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ వంటి గ్రేట్ బ్యాట్స్‌మెన్ జాబితాలో తాను చేరడం చాలా సంతోషంగా ఉందన్నాడు. నువ్వు 200కి చేరువ అవుతున్నప్పుడు విరాట్‌తో నీతో మాట్లాడిన సంభాషణ ఏంటన గిల్ ప్రశ్నించాడు. దీనిపై ఇషాన్ సమాధానిమిస్తూ.. 'సింగిల్స్ తీయమని నాపై ఒత్తిడి చేయాలని కోహ్లీ భయ్యకు చెప్పా. లేకపోతే నేను కొట్టేస్తానని అన్నాను. నాకు పరుగులు చేయాలనే ఉత్సాహం ఉడడంతో బంతి బాదేస్తానని చెప్పాను..' కోహ్లీతో చెప్పినట్లు ఇషాన్ కిషన్ తెలిపాడు. 

వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాలని గ్రౌండ్‌లోకి దిగరా..? అని గిల్ ప్రశ్నించగా.. 'లేదు, నేను ఇలాంటివి ఆలోచించి దిగలేదు. నేను 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్కోరు బోర్డు చూశా. తరువాత పట్టించుకోలేదు. మళ్లీ 146 పరుగుల వద్ద ఉన్నప్పుడు చూశా. ఇక మళ్లీ 190 రన్స్ దాటిన తరువాత చూశా. వికెట్ చాలా బాగా అని అనిపించింది. నేను ఏమీ ఆలోచించడం లేదు. మీకు అలాంటి పరిస్థితి ఉంటే.. దూకుడుగా మాత్రమే ఆడండి..' అంటూ గిల్‌కు సలహా ఇచ్చాడు ఇషాన్ కిషన్.

227 పరుగుల తేడాతో విజయం 

చిట్టగాంగ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరి క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 227 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేలో టీమిండియా 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. కిషన్ 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు చేసి తన అంతర్జాతీయ కెరీర్‌లో 72వ సెంచరీని నమోదు చేశాడు. అనంతరం బంగ్లాదేశ్ జట్టు 182 పరుగులకు ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  

Also Read: Pawan Kalyan: ట్యాక్స్ కట్టేందుకు పవన్ కళ్యాణ్‌ రూ.5 కోట్ల అప్పు.. జనసేన నేత వీడియో వైరల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News