MS Dhoni-Sunil Gavaskar: చివరి మ్యాచ్ ఆడేసిన ఎంఎస్ ధోనీ.. ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత క్రికెట్ దిగ్గజం!

India Ex Player Sunil Gavaskar gets autograph from CSK Captain MS Dhoni. ఐపీఎల్ 2023కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్ మైదానంలోకి వచ్చి ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 15, 2023, 01:35 PM IST
MS Dhoni-Sunil Gavaskar: చివరి మ్యాచ్ ఆడేసిన ఎంఎస్ ధోనీ.. ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత క్రికెట్ దిగ్గజం!

India Ex Player Sunil Gavaskar gets autograph from CSK Captain MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో చివరి మ్యాచ్ ఆడేసింది. ఆదివారం (మే 14) రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో చెన్నై తలపడింది. 16వ సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌లో సొంత మైదానం వేదికగా చెన్నై జట్టుకు ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో తమ జట్టుకు మద్దతుగా నిలిచేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఎక్కడ చూసినా పసుపు మయమే కనిపించింది. చెన్నై ఫాన్స్ హంగామా మాములుగా లేదు. 

ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కి సొంత మైదానంలో చివరి మ్యాచ్ కావడంతో మైదానానికి వచ్చిన తమ ప్రేక్షకులకు చెన్నై ప్లేయర్స్ బహుమతులు ఇచ్చారు. టీషర్ట్స్‌, గ్లోవ్స్, బాల్స్‌ను గ్యాలరీలోకి విసిరేశారు. దాంతో ఫాన్స్ వాటిని అందుకుని తెగ సంబరపడిపోయారు. ఇక కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానం చుట్టూ తిరుగుతూ చెన్నై అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్లేయర్స్ సీఎస్‌కే జెండాతో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. ఇదే సమయంలో ఐపీఎల్ 2023కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్ మైదానంలోకి వచ్చి ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నాడు. 

క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కంటే ముందు భారత క్రికెట్‌ను ఏలిన సునీల్ గవాస్కర్.. ఎంఎస్ ధోనీని అడిగి ఆటోగ్రాఫ్ తీసుకోవడం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఆకట్టుకుంది. గవాస్కర్ షర్ట్‌పై మహీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన చెన్నై, ధోనీ అభిమానుల ఆనందానికి అవద్దుల్లేకుండా పోయాయి. ఈ వీడియోకి లైకుల, కెమెంట్ల వర్షం కురుస్తుంటుంది. మరోవైపు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ అవుతాడనే ఉద్దేశంతోనే సునీల్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 రన్స్ చేసింది. శివమ్‌ దూబే (48 నాటౌట్‌; 1 ఫోర్‌, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (57 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్సర్‌), రింకూ సింగ్‌ (54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలు చేశార. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌ 3 వికెట్లు పడగొట్టాడు.   

Also Read: Tata Nexon Facelift: మార్కెట్‌ను షేక్ చేయడానికి వస్తున్న టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్స్ లీక్!

Also Read: Hyundai Exter SUV Launch: అద్భుతమైన లుక్స్, ఫీచర్లతో హ్యుండయ్ Exter SUV, బుకింగ్స్ ప్రారంభం, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News