Trolls On Sanju Samson: సంజూ శాంసన్ పరువు తీసిన నెటిజెన్స్.. మీమ్స్ వైరల్!

Trolls On Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ జట్టు కేప్టేన్ సంజూ శాంసన్‌ని నెటిజెన్స్ దారుణంగా ఆడుకుంటున్నారు. సంజూ శాంసన్ పర్‌ఫార్మెన్స్‌పై ఎవరికి తోచిన రీతిలో వారు మీమ్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నెటిజెన్స్ సంజూని ఏమంటున్నారో మీరే చూడండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 10:53 AM IST
Trolls On Sanju Samson: సంజూ శాంసన్ పరువు తీసిన నెటిజెన్స్.. మీమ్స్ వైరల్!

Trolls on Rajasthan Royals Captain Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ జట్టు కేప్టేన్ సంజూ శాంసన్ పరువు తీస్తున్నారు నెటిజెన్స్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ డకౌట్ అవడమే అందుకు కారణం. ఒక్కసారి డకౌట్ అయినందుకే అంతగా పరువు తీయాలా అని అనుకోవద్దు.. ఎందుకంటే, ఈ ఐపిఎల్ 2023 సీజన్‌లో సంజూ శాంసన్ ఇలా డకౌట్ అవడం ఇది వరుసగా రెండోసారి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున 9వ ఓవర్లో 4వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ శాంసన్.. సింగిల్ రన్ కూడా తీయకుండానే రవింద్ర జడేజా బౌలింగ్‌లో ఔట్ అయి పెవిలియన్ బాటపట్టాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ సంజూ శాంసన్ డకౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో సంజూ శాంసన్ పర్‌ఫార్మెన్స్‌పై నెటిజెన్స్ నేరుగానే సెటైర్లు పేల్చుతున్నారు. ఏ ఐపిఎల్ సీజన్‌లో అయినా మొదటి రెండు మ్యాచ్‌లకే సంజూ శాంసన్ పర్‌ఫార్మెన్స్ బాగుంటుందని.. ఆ తరువాతి మ్యాచ్ లన్నీ సంజూ శాంసన్ దారుణంగా విఫలం అవుతున్నాడని సంజూని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. 

మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 175 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్ 52 పరుగులు (36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) తో రాణించగా.. దేవదత్ పడిక్కల్ 38 పరుగులు (26 బంతుల్లో 5 ఫోర్లు) రాబట్టాడు. జోష్ మీదున్న జోస్ బట్లర్ ని మొయీన్ అలీ పెవిలియన్ కి పంపించగా.. రవింద్ర జడేజా బౌలింగ్ లో దేవదత్ పడిక్కల్ కొట్టిన షాట్ ని డెవాన్ క్యాచ్ పట్టి ఔట్ చేశాడు. ఆ తరువాత రవిచంద్రన్ అశ్విన్, షిమ్రన్ హెట్మెయిర్ చెరో 30 పరుగులు జోడించడంతో జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. 

ఇది కూడా చదవండి: CSK vs RR Playing 11: రాజస్థాన్‌దే బ్యాటింగ్.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీకి స్పెషల్ మ్యాచ్!

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్ల జాబితా: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కేప్టేన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్ల జాబితా: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్ కమ్ కేప్టేన్ ), సిసంద మగల, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్.

ఇది కూడా చదవండి: Surya Kumar Yadav IPL: సూర్యకుమార్ యాదవ్ నువ్వో తోపు ప్లేయర్.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News