RCB vs CSK Head To Head: బెంగళూరు vs చెన్నై హెడ్ టు హెడ్ రికార్డ్స్.. పిచ్‌ రిపోర్ట్‌, తుది జట్లు ఇవే!

RCB vs CSK IPL 2023 Match 24 Head To Head Records, Pitch Report, Playing 11 and Dream11 Prediction. ఐపీఎల్‌ చరిత్రలో బెంగళూరు, చెన్నై జట్లు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై 20 విజయాలు అందుకోగా.. బెంగళూరు 10 మ్యాచుల్లోనే విజయం సాధించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 17, 2023, 03:12 PM IST
RCB vs CSK Head To Head: బెంగళూరు vs చెన్నై హెడ్ టు హెడ్ రికార్డ్స్.. పిచ్‌ రిపోర్ట్‌, తుది జట్లు ఇవే!

RCB vs CSK IPL 2023 Match 24 Head To Head Records, Pitch Report, Playing 11 and Dream11 Prediction: ఐపీఎల్ 2023లో సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. నేడు సొంత మైదానం ఎం చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. సోమవారం రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కు మ్యాచ్ ఆరంభం అవుతుంది. రెండు టాప్ జట్ల మధ్య మ్యాచ్ కాబట్టి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే అభిమానుల కళ్లన్నీ చెన్నై కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ, బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. ఈ ఇద్దరి ఆట చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా వేచిచూస్తున్నారు. 'జియో సినిమా'లో ఐపీఎల్ మ్యాచులు ఫ్రీగా చూసే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. 

RCB vs CSK Pitch Report:
గత మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ చేతిలో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలవాలని చూస్తోంది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయంపై కన్నేసింది. ఇక నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ కొత్త పిచ్‌పై జరిగే అవకాశాలు ఉన్నాయి. టాస్‌ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్‌ ఎంచుకోనుంది. అయితే గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరే గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో సగటున 170-180 పరుగుల స్కోరు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియం బౌండరీ లైన్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి పరుగుల వరద పారే అవకాశం ఉంది. 

RCB vs CSK Head To Head:
ఐపీఎల్‌ చరిత్రలో బెంగళూరు, చెన్నై జట్లు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై 20 విజయాలు అందుకోగా.. బెంగళూరు 10 మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. గత సీజన్‌లో చెరో విజయం సాధించాయి. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు చెన్నై, బెంగళూరు 9 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు చెరో నాలుగేసి మ్యాచుల్లో గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.

RCB vs CSK Top Scores:
ఐపీఎల్‌ చరిత్రలో మొత్తంగా చెన్నైపై బెంగళూరు అత్యధిక స్కోరు 205 పరుగులు కాగా.. అత్యల్ప స్కోరు 70 పరుగులు. బెంగళూరుపై చెన్నై అత్యధికంగా 215 పరుగులు చేయగా.. అత్యల్పంగా 71 పరుగులు చేసింది. చెన్నై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ రవీంద్ర జడేజా (18 వికెట్లు) కాగా.. బెంగళూరు నుంచి హర్షల్‌ పటేల్ (12 వికెట్లు) ఉన్నాడు. చెన్నైపై బెంగళూరు సగటు స్కోరు 155 కాగా.. చెన్నైకి  157 పరుగులు.

RCB vs CSK Playing 11:
బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్), మహిపాల్ లామ్రోర్, గ్లెన్‌ మాక్స్‌వెల్, షహ్‌బాజ్‌ అహ్మద్, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), వహిందు హసరంగ, హర్షల్‌ పటేల్, వ్యాన్‌ పార్నెల్, మొహ్మద్ సిరాజ్, వైశాక్ విజయ్‌ కుమార్. 
చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్, డేవన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), మహీశ్ పతిరాన, మహీశ్ తీక్షణ, తుషార్‌ దేశ్ పాండే. 

RCB vs CSK Dream11 Prediction:
కీపర్ - డెవాన్ కాన్వే
బ్యాట్స్‌మెన్ - విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్
ఆల్ రౌండర్లు - రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మొయిన్ అలీ
బౌలర్లు - మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్‌పాండే, వైశాంక్ విజయ్‌కుమార్

Also Read: ఒకే మైదానంలో అత్యధిక టీ20 హాఫ్ సెంచరీలు.. టాప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్! పూర్తి లిస్ట్ ఇదే  

Also Read: OnePlus 11 5G Price 2023: డెడ్ చీప్‌గా వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఏకంగా 25 వేల డిస్కౌంట్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News