CSK Captain MS Dhoni to come as impact player vs GT match in IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. గుజరాత్, చెన్నై మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. అయితే ఆరంభ వేడుకల నేపథ్యంలో ఈ మ్యాచ్ లేటుగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనునున్నాడు.
క్యాష్ రిష్ లీగ్ ఐపీఎల్‌ను మరింత ఆకర్షనీయంగా మార్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వైడ్, నోబాల్‌కు రివ్యూ.. టాస్ అనంతరం తుది జట్టు ప్రకటన, ఇంపాక్ట్ ప్లేయర్ లాంటి కొత్త నిబంధనలను ఐపీఎల్ 2023లో ప్రవేశ పెట్టబోతుంది. ఈ నిబంధలను చెన్నై సూపర్ కింగ్స్ వాడుకోవాలని చూస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో గాయం కారణంగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ ఎడమ మొకాలికి గాయమైందని, తొలి మ్యాచ్ ఆడలేడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఎంఎస్ ధోనీ గాయంపై నెట్టింట వస్తున్న వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందించారు. గుజరాత్ మ్యాచ్ ఆడేందుకు ధోనీ ఫిట్‌గా ఉన్నాడని, 100 శాతం ఆడుతాడని పేర్కొన్నారు. అయితే ధోనీ పూర్తి ఫిట్‌గా లేని పరిస్థితిలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా (MS Dhoni Impact Player) బరిలోకి దిగుతాడని సమాచారం తెలుస్తోంది. ధోనీని బ్యాటింగ్‌కు పంపించి, డెవాన్ కాన్వేతో కీపింగ్ చేయించాలని చెన్నై మేనేజ్మెంట్ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఇలా అయితే టీం కాంబినేషన్ కూడా సెట్ అవ్వుతుంది. చెన్నై జట్టులో ప్రస్తుతం ధోనీ తప్ప స్పెసలిస్ట్ కీపర్ ఎవరూ లేరు.
ఓపెనర్లుగా డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఆడనుండగా.. ఫస్ట్ డౌన్‌లో మొయిన్ అలీ ఆడుతాడు. నాలుగో స్థానంలో అంబటి రాయుడు, ఐదో స్థానంలో బెన్ స్టోక్స్, ఆరో స్థానంలో శివమ్ దూబే, ఏడో స్థానంలో రవీంద్ర జడేజాలు బరిలోకి దిగనున్నారు. ఇక ఎనిమిదో స్థానంలో ఏఎంఎస్ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. దీపక్ చహర్, డ్వేన్ ప్రిటోరియస్\మహేశ్ తీక్షణ, సిమ్రన్‌జిత్ సింగ్ బౌలర్ విభాగంలో బరిలోకి దిగనున్నారు.
Aslo Read: IPL 2023 Winnner: ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచేది ఆ జట్టే.. మాజీ దిగ్గజం జోస్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.