Arjun Tendulkar IPL Debut: ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత టీమిండియా దిగ్గజ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగాడు. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌లో తండ్రీకొడుకులు ఆడడం ఇదే తొలిసారి గమనార్హం. సచిన్ టెండూల్కర్ గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఇద్దరు కూడా కోల్‌కతా జట్టుపై ఐపీఎల్ కెరీర్ ప్రారంభించడం విశేషం. తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న అర్జున్.. దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటుతున్నాడు.
2021 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. గతేడాది సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ అర్జున్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చింది. అయితే చివరికి రూ.30 లక్షలకు ముంబై మళ్లీ సొంతం చేసుకుంది. కానీ గత సీజన్‌లో కూడా బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అర్జున్ ఎంట్రీ కోసం అటు క్రికెట్ అభిమానులతోపాటు సచిన్ టెండూల్కర్ కూడా ఎంతో ఎదురుచూశాడు. సుదీర్ఘ ఎదురుచూపులతో తరువాత నేడు తొలి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది.
Sara Tendulkar Watching Debut of Arjun Tendulkar
#IPL2023 #Arjuntendurkar #SaraTendulkar #MIvsKKR #IPLonJioCinema pic.twitter.com/t4SLDAycUS— Mohan Yesansure (@MohanYesne) April 16, 2023
మ్యాచ్‌కు ముందు ముంబైకు మెంటార్‌గా పనిచేస్తున్న తన తండ్రి సచిన్‌తో అర్జున్ చాలా సేపు మాట్లాడాడు. సచిన్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అర్జున్‌కు కీలక సూచనలు చేశాడు. అర్జున్‌పై ఐపీఎల్ తొలి మ్యాచ్ ఒత్తిడి లేకుండా చూశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జున్ సోదరి సారా టెండూల్కర్ కూడా స్టాండ్స్‌లో కూర్చొంది. తమ్ముడు బౌలింగ్ చేస్తున్న సమయంలో చప్పట్లతో ఉత్సాహపరిచింది. ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి తమ్ముడు అర్జున్‌కు సపోర్ట్ చేసింది. డగౌట్‌లో కూర్చొని సచిన్ తనయుడి బౌలింగ్‌ను చూసి ఎంజాయ్ చేశాడు.
Cutest Ever ❤️🙈😍🫶 #SaraTendulkar pic.twitter.com/6doC78DndR
— RAJAT (@R54038700Singh) April 16, 2023
ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్.. తొలి ఓవర్‌ను అర్జున్‌తోనే వేయించాడు. ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్‌లోనే తొలి ఓవర్ వేసేందుకు అర్జున్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫినిష్ చేశాడు. ఈ ఓవర్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండో ఓవర్‌లో మాత్రం 12 రన్స్ ఇచ్చాడు. మళ్లీ ఆ తరువాత బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో ఇంకా చాలా ప్రయాణం ఉండడంతో అర్జున్ టెండూల్కర్‌కు మరిన్ని అవకాశాలు రానున్నాయి. ఇక్కడ నిరూపించుకుంటే త్వరలో టీమిండియా జెర్సీలో కూడా అర్జున్‌ను చూడొచ్చు.
Also Read: GT vs RR Updates: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఫామ్‌లో ఉన్న ప్లేయర్ ఔట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook