GT vs CSK Qualifier 1: ఎంఎస్ ధోనీ వ్యాఖ్యలను ఖండించిన లసిత్‌ మలింగ!

MS Dhoni Heap Praise on Matheesha Pathirana ahead of GT vs CSK Qualifier 1. శ్రీలంక మాజీ కెప్టెన్ కమ్ బౌలర్ లసిత్ మలింగ మాత్రం ఎంఎస్ ధోనీ వ్యాఖ్యలను ఖండించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 23, 2023, 05:01 PM IST
GT vs CSK Qualifier 1: ఎంఎస్ ధోనీ వ్యాఖ్యలను ఖండించిన లసిత్‌ మలింగ!

Lasith Malinga Slams MS Dhoni over Comments on Matheesha Pathirana ahead of GT vs CSK Qualifier 1: ఐపీఎల్‌ 2022లో తడబడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. 2023లో మాత్రం దూసుకుపోతుంది. 16వ సీజన్ ఆరంభం నుంచే విజయాలు సాధిస్తూ.. ప్లేఆఫ్స్ చేరింది. నేడు అగ్రస్థానంలో లీగ్ దశను ముగించిన గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్‌ 1లో తలపడనుంది. చెన్నైలోని చెపాక్‌  వేదికగా మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో గెలిచి ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకోవాలని చూస్తోంది. శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ రాణిస్తే ఇదేమీ పెద్ద కష్టం కాదు. ఎందుకంటే చెన్నై విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. వైవిధ్యమైన బౌలింగ్ తో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 వికెట్లు తీశాడు.

బేబీ మలింగగా పేరొందిన మతీశ పతిరణ డెత్‌ ఓవర్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మలింగ మాదిరి బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తనకు అవకాశాలు ఇచ్చిన చెన్నై కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో పతిరణపై ధోనీ ప్రశంసలు కురిపించాడు. 'మతీశ పతిరణ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం కావాలి. టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటే బాగుంటుంది' అని ధోనీ తన మనసులో మాట చెప్పాడు. గాయాల బారిన పడితే కెరీర్‌ ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంలో మహీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

శ్రీలంక మాజీ కెప్టెన్ కమ్ బౌలర్ లసిత్ మలింగ మాత్రం ఎంఎస్ ధోనీ వ్యాఖ్యలను ఖండించాడు. 'గాయాలకు భయపడి టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. టెస్ట్ క్రికెట్‌ ఆడితేనే టెక్నిక్‌ మెరుగుపడుతుండి. నేను కూడా టెస్టులు ఆడిన వాడినే. ఎంఎస్ ధోనీ సీరియస్‌గానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే.. అవి ఆమోదనీయం కాదు' అని లసిత్ మలింగ అన్నాడు. మరో శ్రీలంక మాజీ పేసర్ చమింద వాస్‌ మాత్రం మహీ  వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడు. మతీశ పతిరణ లాంటి బౌలర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో  ఉందన్నాడు. 

'ఎంఎస్ ధోనీ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. మతీశ పతిరణ లాంటి బౌలర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పతిరణ వైవిధ్యమైన, ప్రత్యేకమైన యాక్షన్‌ కలిగిన బౌలర్‌. ఒకవేళ అతడు అన్ని ఫార్మాట్లలో ఆడితే.. ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేస్తే పెద్దగా భారం పడదు. టెస్ట్ ఫార్మాట్లో రోజుల తరబడి బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సమస్యలు తప్పవు' అని చమింద వాస్‌ చెప్పుకొచ్చాడు. 

Also Read: GT vs CSK Qualifier 1: అన్ని గుజరాత్ టైటాన్స్‌కే అనుకూలం.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓటమి తప్పదా?  

Also Read: GT vs CSK Qualifier 1: చెన్నైతో గుజరాత్‌ మ్యాచ్‌.. ధోనీ సేనకు గిల్‌ వార్నింగ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

Trending News