Sunrisers Hyderabad Top Records after beat Rajasthan Royals: ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. రాజస్థాన్‌ను చివరి బంతికి చిత్తు చేసి ఊహించని విజయం సాధించింది. 20వ ఓవర్ చివరి బంతిని రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ నో బాల్ వేయగా.. ఆ తర్వాతి బంతిని సన్‌రైజర్స్ బ్యాటర్ అబ్దుల్ సమద్ సిక్స్ బాది మ్యాచ్‌ను గెలిపించాడు. దాంతో సన్‌రైజర్స్ ఖాతాలో మరో విషయం చేరింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 రన్స్ చేసింది.
ఈ విజయంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌పై 215 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. 2019లో రాజస్థాన్‌పైనే 199 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఛేదించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 215 పరుగులను ఛేదించి రికార్డు సృష్టించింది. చివరి 2 ఓవర్లలో 41 పరుగులు సాధించి హైదరాబాద్ విజయం సాధించింది. చివరి 2 ఓవర్లలో 40కి పైగా రన్స్ చేసి గెలిచిన మూడో జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. 2012 సీజన్‌లో బెంగళూరుపై చెన్నై 43 పరుగులు చేసి గెలవగా.. 2023 సీజన్‌లో గుజరాత్‌పై కోల్‌కతా 43 పరుగులు చేసింది.
టాప్ రికార్డ్స్ ఇవే (IPL 2023 SRH Records):
# జైపుర్‌లో అత్యంత విజయవంతమైన ఛేజింగ్ ఇదే. ఇంతకుముందు డెక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ 197 (2012) పరుగులు చేసి విజయం సాధించింది.
# ఐపీఎల్ చరిత్రలో 200కిపైగా పరుగుల ఛేదన చేయడం ఇది 21వ సారి. ఈ సీజన్‌లో ఆరోది.
# ఒకే మ్యాచ్‌లో 400లకు పైగా పరుగులు నమోదు కావడం ప్రస్తుత సీజన్‌లో 12వ సారి. మొత్తంగా 60వ సారి.
# ఐపీఎల్‌లోనూ ఐదో అత్యధిక పరుగుల ఛేదనగా ఈ మ్యాచ్ నిలిచింది. ఇప్పటివరకు 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై 224 పరుగులను రాజస్థాన్ ఛేదించింది.
# ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్‌కు ఆరో ఓటమి. తొలి ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచి ఒక మ్యాచ్‌లోనే ఓడిన రాజస్థాన్.. తర్వాతి ఆరింటిలో కేవలం ఒక్కటే గెలిచి గెలిచింది.
# జైపుర్‌లో 214/2 స్కోరే అత్యధికం. ఐపీఎల్ 2023లో చెన్నైపై రాజస్థాన్ 202/5 స్కోరు చేసింది.
# రెండో వికెట్‌కు రాజస్థాన్ తరఫున అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన రెండో మ్యాచ్. జోస్ బట్లర్ - సంజూ శాంసన్ కలిసి 138 పరుగులు చేశారు. వీరిద్దరే ఎస్‌ఆర్‌హెచ్‌పై 2021లో 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
# కనీసం 25 పరుగులు చేసిన మ్యాచ్‌లో అత్యుత్తమ స్ట్రైక్‌రేట్ కలిగిన రెండో బ్యాటర్‌గా గ్లెన్ ఫిలిప్స్ నిలిచాడు. గతంలో గుజరాత్‌పై శశాంక్ సింగ్ 6 బంతుల్లో 25 రన్స్ చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 416.66గా ఉంది. రాజస్థాన్‌పై ఫిలిప్స్ 357.14 స్ట్రైక్‌రేట్‌తో విజృంభించాడు.
# సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జోస్ బట్లర్ చెలరేగిపోతున్నాడు. గత నాలుగు మ్యాచుల్లో 124, 35, 54, 95 పరుగులు చేశాడు.
Also Read: Sandeep Sharma No-Ball: నో బాల్ గురించి ఆలోచించడం లేదు.. సందీప్ శర్మకు అన్ని తెలుసు: సంజూ శాంసన్
Also Read: Rakul Preet Pics : రకుల్ ప్రీత్ అందాల ప్రదర్శన.. నాభి అందాల విందు.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.