IPL 2023 Playoffs: ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు.. ఎవరితో ఎవరు ఢీ అంటే..?

IPL 2023 Playoffs Schedule Venue Date and Timings: గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. ఏ జట్టుతో ఏ జట్టు తలపడనుంది..? మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయి..? పూర్తి వివరాలు ఇలా..!  

Written by - Ashok Krindinti | Last Updated : May 22, 2023, 10:41 AM IST
IPL 2023 Playoffs: ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు.. ఎవరితో ఎవరు ఢీ అంటే..?

IPL 2023 Playoffs Schedule Venue Date and Timings: ప్లే ఆఫ్స్‌ ఉత్కంఠకు తెరపడింది. 70 మ్యాచ్‌ల లీగ్ దశ తరువాత టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. ఆదివారం సన్‌రైజర్స్‌పై విజయంతో ముంబై ప్లే ఆఫ్స్‌ చేరగా.. గుజరాత్ చేతిలో ఓటమితో బెంగుళూరు ఇంటిముఖం పట్టింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తోపాటు ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానం కైవసం చేసుకోగా..చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ ఖాతాలో 20 పాయింట్లు ఉండగా.. చెన్నై ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి.

ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫైయర్-1 మ్యాచ్‌ జరగనుంది. రేపు చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియం వేదికగా పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలోనూ.. ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఎలిమినేటర్ పోరు జరగనుంది. 

మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 26న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనున్నాయి. మే 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టు.. రెండో క్వాలిఫయర్‌లో గెలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లు అన్ని స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటీటీలో చూడాలనుకునేవారు జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ప్లేఆఫ్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల నుంచి మొదలవుతాయి.  

మే 23: చెన్నై సూపర్ కింగ్స్ Vs గుజరాత్ టైటాన్స్.. వేదిక: ఎం.చిదంబరం స్టేడియం, చెన్నై
మే 24: లక్నో సూపర్ జెయింట్స్ Vs ముంబై ఇండియన్స్.. వేదిక: ఎం.చిదంబరం స్టేడియం, చెన్నై
మే 26: క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టు Vs ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌
మే 28: క్వాలిఫైయర్-1లో గెలిచిన జట్టు Vs క్వాలిఫైయర్-2లో గెలిచిన జట్టు.. వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌

Also Read: Tamannaah NBK 108 : అనిల్ రావిపూడితో గొడవలు.. ఎంతో బాధగా ఉందంటూ తమన్నా క్లారిటీ

Also Read: Avinash Reddy Arrest: కర్నూలులో హై టెన్షన్, ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డి అరెస్టు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News