IPL 2023 Final Match, CSK vs GT Match: ఐపిఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే పరిస్థితేంటి ?

IPL 2023 Final Match Date, Time And Venue Stadium : ఐపిఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌పై నీలి మేఘాలు కమ్ముకుంటే పరిస్థితి ఏంటనే ఆందోళన క్రికెట్ ప్రియుల్లో నెలకొని ఉంది. అహ్మెదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఇదే స్టేడియంలో ఇటీవల జరిగిన మ్యాచ్‌లోనూ గాలి వాన కారణంగా మ్యాచ్ 30 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

Written by - Pavan | Last Updated : May 27, 2023, 08:52 PM IST
IPL 2023 Final Match, CSK vs GT Match: ఐపిఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే పరిస్థితేంటి ?

IPL 2023 Final Match Date, Time And Venue Stadium: ఐపిఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడేందుకు ఇంకా 24 గంటల సమయమే మిగిలి ఉంది. క్రికెట్ ప్రియులు అందరికీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తరువాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న మ్యాచ్ ఏదైనా ఉందా అంటే అది ఐపిఎల్ 2023 ఫైనల్ మ్యాచే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపిఎల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దానికితోడు ఒక్కో మ్యాచ్ ముగించుకుని పైనల్ మ్యాచ్‌కి చేరుకున్న కొద్దీ ఆ క్రెజ్ అంతకంతకూ రెట్టింపు అవుతూ వస్తోంది. ఎందుకంటే ఏ రెండు జట్లకు ఫైనల్ మ్యాచ్‌లో తలపడే అవకాశం దక్కుతుందా అనే ఉత్కంఠ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కాబట్టే ఫైనల్ మ్యాచ్ సమీపిస్తున్న క్రేజ్ ఇంకా ఎక్కువవుతుంది. 

ప్రస్తుతం దేశ విదేశాల్లోని క్రికెట్ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఐపిఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌పై నీలి మేఘాలు కమ్ముకుంటే పరిస్థితి ఏంటనే ఆందోళన క్రికెట్ ప్రియుల్లో నెలకొని ఉంది. అహ్మెదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఇదే స్టేడియంలో ఇటీవల జరిగిన మ్యాచ్‌లోనూ గాలి వాన కారణంగా మ్యాచ్ 30 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తుగా ఐపిఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ విషయంలోనూ వర్షం ఆటంకంగా మారితే.. ఫైనల్ మ్యాచ్ పరిస్థితి ఏంటి అనే ఆందోళన నెలకొని ఉంది.

ఐపిఎల్ గేమ్ రూల్స్ ప్రకారం, లీగ్ దశలో ఉన్నప్పుడు ఒకవేళ వర్షం కారణంగా రెండు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడిన తరువాత మ్యాచ్ ఆగిపోయే పరిస్థితి వస్తే.. డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ పద్ధతి ప్రకారం మ్యాచ్ ఫలితం నిర్ణయిస్తారు. ఒకవేళ కనీసం ఆ 5 ఓవర్లు కూడా పూర్తి కానట్లయితే ఆ మ్యాచ్ రద్దు చేసి, రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయిస్తారు.

మరి ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌ విషయంలో ఏం జరుగుతుందంటే.. ఫైనల్ మ్యాచ్ విషయంలో కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ ఫలితం ఎటూ తేలకపోతే.., పాయింట్స్ టేబుల్ ఆధారంగా ఎవరు అగ్ర స్థానంలో ఉంటే వారినే విన్నర్‌గా నిర్ణయిస్తారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఏదైనా కారణాల వల్ల ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిస్తే.. లీగ్ దశలో ఎక్కువ పాయింట్స్ ఎవరికి ఉంటే వారే ఆ లక్కీ విన్నర్ అవుతారన్నమాట.

Trending News