IPL 2023 Final Postponed: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్డేడియంలో జరగవల్సిన మ్యాచ్ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా నిన్న జరగలేదు. రిజర్వే డే ఇవాళ్టికి వాయిదా పడింది. గత 15 సీజన్లలో ఫైనల్ మ్యాచ్ వాయిదా పడటం ఇదే తొలిసారి.
ఐపీఎల్ 2023 ఫైనల్ కోసం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ సిద్ధమయ్యాయి. నరేంద్ర మోదీ స్డేడియంలో నిన్న జరగవల్సిన ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఇవాళ్టికి వాయిదా పడింది. రాత్రి 12 గంటల వరకూ వర్షం కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 9.10 నిమిషాలకు వర్షం ఆగడంతో పిచ్ సిద్ధం చేయసాగారు. 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావచ్చని చెరో 17 ఓవర్లకు మ్యాచ్ ఉంటుందని అంచనా వేశారు. కాస్సేపట్లో టాస్ వేస్తారనగా తిరిగి వర్షం ప్రారంభమైంది. రాత్రి వరకూ కురుస్తూనే ఉండటంతో విధిలేక రిజర్వ్ డే ఇవాళ్టికి వాయిదా వేశారు. గుజరాత్ వర్సెస్ చెన్నై తుదిపోరు చూసేందుకు ఎదురుచూసిన ప్రేక్షకులకు భారీ నిరాశే ఎదురైంది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
రిజర్వ్ డే ఇవాళ ఐపీఎల్ 2023 తుది పోరు జరగనుంది. ఇవాళ కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే ఐపీఎల్ పాయింట్స్ పట్టిక ప్రకారం అగ్రస్థానంలో ఉన్న జట్టుకు విజేతగా ప్రకటిస్తారు. అదే జరిగితే మ్యాచ్ జరగకుండానే గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెల్చుకుంటుంది. వరుసగా రెండవసారి టైటిల్ సాధించిన ఘనత దక్కించుకుంటుంది.
అయితే కనీసం చెరో ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించేందుకే చూస్తారు. అంటే ఓ గంట సమయం మిగిలినా షార్ట్ మ్యాచ్ ద్వారా ఫలితం నిర్ణయించేందుకు ఎదురుచూస్తారు. అదీ సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా అంటే చెరో ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించే ప్రక్రియ జరుగుతుంది. అప్పటికీ సాధ్యం కాకుంటేనే లీగ్ దశలో అంటే మొదటి 70 మ్యాచ్‌లలో వచ్చిన పాయింట్ల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండవ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 17 పాయింట్లు సాధించింది. మ్యాచ్ అసలు జరగకపోతే ఐపీఎల్ 2023 విజేత గుజరాత్ టైటాన్స్ కానుంది.
వాస్తవానికి నిన్న అంటే మే 28న రాత్రి 11 గంటల తరువాత వర్షం తగ్గుముఖం పట్టింది. అంటే చెరో 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు వీలుండే పరిస్థితి. కానీ స్డేడియంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇవాళ రిజర్వ్ డేకు వాయిదా వేశారు.
Also read: CSK Vs GT Rain Updates: ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook