MS Dhoni Fans: ఎంఎస్ ధోనీని చూడటం కోసమే ఈ జాబ్‌ చేస్తున్నా!

MS Dhoni Fans Special Video Goes Viral ahead of IPL 2023 Final. ఎంఎస్ ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్‌ అంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో అభిమానులు ప్రత్యేక సందేశాలు పెడుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 28, 2023, 05:49 PM IST
MS Dhoni Fans: ఎంఎస్ ధోనీని చూడటం కోసమే ఈ జాబ్‌ చేస్తున్నా!

`CSK Fans Special Message to MS Dhoni ahead of IPL 2023 Final: ఐపీఎల్‌ 2023 ఫైనల్‌కు సమయం దగ్గరపడింది. నేడు గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా ఈ ఫైనల్‌ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలవాలని గుజరాత్‌ చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐదోసారి ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడాలని చెన్నై భావిస్తోంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్‌ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చెపాక్‌ మైదానంలో చెన్నై చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఆడిన అనంతరం ధోనీ స్టేడియంలో పరేడ్‌ నిర్వహించి అభిమానులకు జెర్సీలను విసిరిన విషయం తెలిసిందే. దాంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దాంతో కేవలం ధోనీ కోసమే మ్యాచ్‌ వీక్షించేందుకు అభిమానులు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైనల్ 2023 ఫైనల్ మ్యాచ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అహ్మదాబాద్‌ మైదానం కెపాసిటీ లక్ష్యకు పైగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దాంతో స్టేడియం మొత్తం యెల్లో మయం కానుంది. 

ఎంఎస్ ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్‌ అంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో అభిమానులు తమదైన శైలిలో ప్రత్యేక సందేశాలు పెడుతున్నారు. చెన్నై కెప్టెన్ ధోనీపై చూపించే ప్రేమకు సంబంధించి ఓ వీడియోను ఐపీఎల్‌ తమ ట్విటర్‌లో పంచుకుంది. 'ఎంఎస్ ధోనీ అంటే కేవలం లీడర్‌ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్‌', 'ప్రతి ఒక్కరూ ఎంఎస్ ధోనీ అభిమానే' అంటూ ఆ వీడియోకు ఐపీఎల్ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియోలో పలువురు ధోనీ ఫాన్స్ మాట్లాడుతూ తమ ఆరాధ్య క్రికెటర్ పై ఉన్న అభిమానంను చాటుకున్నారు.  వీడియో ఫాన్స్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 

'ఐపీఎల్‌ విధుల్లో నేను 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నా, ఎంఎస్ ధోనీని చూడటం కోసమే నేను ఈ జాబ్‌ చేస్తున్నాను' అని ఓ అభిమాని వీడియోలో పేర్కొన్నాడు. 'ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎంఎస్ ధోనీ చాలా కూల్‌గా ఉంటాడు, తలా ఎప్పటికీ తలానే' అని ఇంకొకరు అన్నారు. 'ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ అని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు. భవిష్యత్తులో చెన్నైకి ఎంత మంది కెప్టెన్లు వచ్చినా ధోనీ లాంటి వారిని మాత్రం మనం ఎప్పుడూ చూడలేము' అని ఇంకో అభిమాని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: CSK vs GT IPL 2023 Final: గుజరాత్‌కు ఐపీఎల్ టైటిల్ కష్టమే.. చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌!  

Also Read: చెన్నై vs గుజరాత్ ఫైనల్ మ్యాచ్.. ఈ రికార్డులపై ఓ లుక్కేయండి! ధోనీని ఊరిస్తున్న రికార్డ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

 

Trending News