IPL New Teams 2022: ఐపీఎల్‌లో వచ్చే ఏడాది రెండు కొత్త ఫ్రాంఛైజీలు చేరనున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ టీమ్స్‌కు సంబంధించి సోమవారం బిడ్డింగ్ (IPL New Team Auction) జరిగింది. రెండు కొత్త ఫ్రాంఛైజీల కోసం ఆర్పీ-ఎస్జీ వెంచర్స్ లిమిటెడ్, ఇరెలియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్) ఈ మొత్తం చెల్లించి లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలను సొంతం చేసుకున్నాయి. లక్నో ఫ్రాంఛైజీ కోసం ఆర్పీఎస్జీ గ్రూప్ అత్యధికంగా రూ. 7090 కోట్ల బిడ్ వేయగా.. అహ్మదాబాద్ కోసం ఇరెలియా కంపెనీ రూ. 5625 కోట్ల బిడ్ వేసింది. ఈ బిడ్డింగ్ ద్వారా బీసీసీఐకి మరో రూ. 12,715 కోట్లు (BCCI Income From IPL) జమ అయ్యాయి. ఫ్రాంఛైజీ సొంతం చేసుకునేందుకు బీసీసీఐ రూ. 2000 కోట్లను కనీస వేలంగా వెల్లడించింది. దీనికి ఆర్పీఎస్జీ 350 శాతం, సీవీసీ 250 శాతం అధికంగా బిడ్ వేయడం విశేషం.
క్రికెట్ విలువ ఇదే..
"ఐపీఎల్‌లో వచ్చే సీజన్ నుంచి రెండు కొత్త జట్లకు స్వాగతం పలికేందుకు సంతోషంగా ఉంది. కొత్త ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్న సంస్థలకు అభినందనలు. ఐపీఎల్ ఇప్పుడిక రెండు కొత్త నగరాలకు వెళ్లనుంది. ఈ జట్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడం గొప్పగా ఉంది. ఇది మన క్రికెట్ విలువను చాటుతోంది. ఈ కొత్త జట్ల ద్వారా మరింత మంది దేశవాళీ ఆటగాళ్లు ప్రపంచ స్థాయి ఆటను ఆడే అవకాశం దక్కుతుంది. భారత్ బయట నుంచి కూడా జట్ల కోసం బిడ్లు వచ్చాయి" అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు.
10 జట్లు 74 మ్యాచ్‌లు
దీంతో ఐపీఎల్ 15వ సీజన్లో (IPL 2022) పది టీమ్స్ పోటీ పడనున్నాయి. దీంతో మ్యాచ్‌ల నిర్వహణ సంఖ్య కూడా 74కు (IPL Matches In 2022) చేరనుంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్‌పై మరింత ఆసక్తి పెరిగింది. లీగ్ మ్యాచ్‌లు 70, ప్లేఆఫ్స్ 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో అన్నీ జట్లు 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలోని టాప్-4 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుతాయి.
బిడ్డింగ్‌లో పాల్గొన్న కంపెనీలు
ఐపీఎల్‌లో (IPL Broadcast Value) రెండు కొత్త టీమ్స్‌ను (New IPL Teams) సొంతం చేసుకునేందుకు అనేక కార్పొరేట్ కంపెనీలు వేలంలో పోటీ పడ్డాయి. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేసింది. కానీ, ఫలితం లేకపోయింది. మరోవైపు అమెరికాకు చెందిన మాంచెస్టర్ యునైటెడ్ యజమాని అయిన గ్లేజర్ ఫ్యామిలీ కూడా ఈ వేలంలో ప్రధానంగా పోటీపడింది.
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో ఓ టీమ్‌ను కొనుగోలు చేసిన రెడ్ బర్డ్ క్యాపిటల్స్ అనే అమెరికా ఆధారిత సంస్థ కూడా బిడ్డింగ్‌లో పాల్గొంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రస్తుతం ఈ సంస్థకు 15 శాతం వాటా ఉంది. దీంతో పాటు అదానీ గ్రూప్, కొటాక్, అరబిందో ఫార్మా, టొరెంట్ గ్రూప్ కూడా ఐపీఎల్‌లో కొత్త టీమ్స్‌ను (IPL New Teams 2022) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి.
Also Read: IPL New Franchise Auction: ఐపీఎల్‌లో కొత్త టీమ్స్ బిడ్డింగ్ కోసం రంగం సిద్ధం..
Also Read: IPL Broadcasting Rights Price: రూ.37 వేల కోట్లకు ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook