Here is Sunrisers Hyderabad Team Full List fir Day 1: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం తొలి రోజున తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) స్టార్ ఆటగాళ్లను తీసుకోకున్నా.. గతంలో కంటే కాస్త ఎక్కువగానే ఖర్చు చేసిందని చెప్పాలి. అయితే అవసరం వచ్చే ఆటగాళ్లను కొందరిని వదిలేసినా.. పనికొచ్చే మరికొందరిని తీసుకోవడం కాస్త సంతోషించాల్సిన విషయం. మరోవైపు అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించి పర్స్ వాల్యూ తగ్గించుకుంది.
ఐపీఎల్ 2022 తొలి రోజు వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తంగా 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో ఇద్దరు ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఉండగా.. మిగతావారు స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌లోని ఆటగాళ్ల సంఖ్య 13కి చేరింది. ఇక ఎస్‌ఆర్‌హెచ్ పర్స్‌లో రూ.20.15 కోట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన డబ్బుతో ఇంకా సన్‌రైజర్స్ దాదాపుగా 10 మంది ఆటగాళ్లను కొనాల్సి ఉంది.
తొలి రోజు వేలం ఆరంభంలో ప్లేయర్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బిడ్ కూడా వేయలేదు. టాప్ 10 స్టార్ ఆటగాళ్లందరినీ వదిలేసింది. అంతేకాదు మొదటి 30 మంది ప్లేయర్లలో ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ ఒక్కరిని కూడా కొనలేదు. మనీశ్ పాండే కోసం తొలి బిడ్ వేసిన కావ్య.. వాషింగ్టన్ సుంధర్‌ను తొలి ఆటగాడిగా కైవసం చేసుకుంది. ఇషాన్ కిషన్ కోసం రూ.15 కోట్ల వరకు బిడ్ వేసినా ఫలితం లేకుండా పోయింది. జానీ బెయిర్‌స్టో వంటి స్టార్‌ను కైవసం చేసుకోలేకపోయింది. ఇక సరైన కీపర్ లేకపోవడంతో నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అభిషేక్ శర్మకు రూ.6.5 కోట్లు పెట్టడం పెద్ద తప్పిదమే అని చెప్పాలి. పేసర్లు భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లను తీసుకోవడం మంచి విషయమే.
ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇదే:
కేన్ విలిమ్సన్ (రూ.14 కోట్లు) ,
అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు) ,
ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు)
వాషింగ్టన్ సుంధర్ (రూ.8.75 కోట్లు)
నికోలస్ పూరన్ (రూ. 10.75 కోట్లు)
నటరాజన్ (రూ.4 కోట్లు)
భువనేశ్వర్ కుమార్ (రూ.4.2 కోట్లు)
ప్రియామ్ గార్గ్ (రూ. 20 లక్షలు)
రాహుల్ త్రిపాఠి (8.50 కోట్లు)
అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు)
కార్తీక్ త్యాగీ (రూ.4 కోట్లు)
జగదీష సుచిత్ (రూ.20 లక్షలు)
శ్రేయస్ గోపాల్(రూ. 75 లక్షలు)
Also Read: Vishakapatnam: విషాదం.. కొడుక్కి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ తండ్రి మృతి
Also Read: ఉక్రెయిన్‌పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. పుతిన్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook