IPL 2024 Updates: 'ఈ ఐపీఎల్ సీజన్ లో ఆ రెండు జట్లతోనే మాకు పోటీ'..: కమిన్స్

IPL 2024: గత సీజన్స్ తో పోలిస్తే ఈ సారి చాలా డేంజరస్ గా కనిపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులను వణికిస్తోంది. తాజాగా జట్టు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ కమిన్స్.  

Written by - Samala Srinivas | Last Updated : May 1, 2024, 02:10 PM IST
IPL 2024 Updates: 'ఈ ఐపీఎల్ సీజన్ లో ఆ రెండు జట్లతోనే మాకు పోటీ'..: కమిన్స్

SRH Captain Pat Cummins Interesting Comments: ప్యాట్ కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ అయినప్పటి నుంచి ఆ జట్టు అద్భుతమైన విజయాలను సాధిస్తుంది. అయితే గత రెండు గేమ్స్ లో ఓడిపోయి ఫ్లే ఆఫ్ అవకాశాలను కాస్త క్లిష్టతరం చేసుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన హైదరాబాద్ ఐదింటిలో గెలిచి పది పాయింట్లతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ లో ఐదో స్థానంలో నిలిచింది. రేపు అంటే మే 02న ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్ లు ఆడిన సంజూ సేన ఎనిమిదింటిలో గెలిచి ఒకటి మాత్రమే ఓడి అగ్రస్థానంలో కొనసాగుతోంది. భీకరమైన ఫామ్ లో ఉన్న రాజస్థాన్ ను ఓడించడమంటే కమిన్స్ సేనకు కొంచెం కష్టమే. 

గతంతో పోలిస్తే ఈసారి ఆరెంజ్ ఆర్మీకి ఫ్యాన్ బేస్ పెరిగింది. అందుకు ప్రధాన కారణం ఆ టీమ్ సృష్టిస్తున్న రికార్డులే. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. తన రికార్డులను తానే కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తోపాటు మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ కూడా చెలరేగి ఆడుతుండటంతో రైజర్స్ భారీ స్కోర్లు సాధిస్తుంది. హైదరాబాద్ కు ఫ్యాన్ బేస్ పెరగడంతో దానిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి కొన్ని కంపెనీలు. ఇందులో భాగంగానే జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. 

Also Read: Team India Squad: టీ20 ప్రపంచకప్ కు 15 మందితో టీమ్ ఇండియా సిద్ధం, ఎవరి బలమెంత

హైదరాబాద్ బిర్యానీ ఇష్టం
ఈ సందర్భంగా అభిమానులు ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతున్నాడు. మా జట్టుకు ఈ సీజన్ లో రెండు జట్లతో మాత్రమే గట్టి పోటీ ఉంటుందని కమిన్స్ అన్నాడు. ఒకటి రాజస్థాన్ అయితే, మరొకటి కేకేఆర్. అంతేకాకుండా తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని మనసులో మాటను వెల్లడించాడు. అంతేకాకుండా  మా రికార్డును మేమే బ్రేక్ చేసి 300 స్కోర్ సాధిస్తామని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. తాజాగా భాగ్యనగరంలోని శరత్ సిటీ మాల్ ను సందర్శించి సందడి చేశారు సన్ రైజర్స్ ఆటగాళ్లు. క్లాసన్, నటరాజన్, సమద్, నితీష్ రెడ్డి శరత్ మాల్ ను సందర్శించి అభిమానులతో ముచ్చటించారు. 

Also Read: RCB PlayOff Chances: ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరు? ఆర్సీబీకి అవకాశాలున్నాయా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News