IPL 2024 KKR vs DC Toss Updates: ఐపీఎల్ 17వ సీజన్లో మరికొన్ని క్షణాల్లో మరో ఉత్కంఠ పోరుకు తెరలేవనుంది. వైజాగ్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తలపడబోతున్నాయి. ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో గెలుపొంది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కేకేఆర్ రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ ఆడిన మూడు మ్యాచుల్లో ఒక దాంట్లోనే విజయం సాధించి ఏడో స్థానంలో నిలిచింది. మరి ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధిస్తుందా లేదా కేకేఆర్ హ్యాట్రిక్ కొడుతుందో తెలియాలంటే మరి కాసేపు ఓపిక పట్టాలి.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. కోల్‌కతా అంగ్క్రిష్ రఘువంశీని, ఢిల్లీ సుమిత్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నాయి. తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ.. గత 3 ఐపీఎల్ మ్యాచ్ ల్లో రెండుసార్లు చాంపియన్ కోల్ కతాను ఓడించింది. ఢిల్లీపై కోల్‌కతా చివరి సారిగా 2021లో విజయం సాధించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మూడు మ్యాచ్‌లు ఆడగా... మూడింటిలోనూ కేకేఆర్ ఓడిపోయింది.
Also Read: Mayank yadav: ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా లక్నో స్పీడ్ గన్... అసలు ఎవరీ మయాంక్ యాదవ్?
ఇరు జట్లు ఫ్లేయింగ్ 11 ఇదే..
ఢిల్లీ టీమ్ : డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషభ్ పంత్(కెప్టెన్), మిచెల్ మార్ష్, టిట్సన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోర్జియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
కోల్‌కతా టీమ్ : ఫిలిఫ్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, నితీశ్ రానా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
Also Read: RCB Vs LSG Live: బ్యాటింగ్‌తో డికాక్ బీభత్సం.. బెంగళూరుపై లక్నో అద్భుత విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి