Indian Fans Trolls Team India Players after Pat Cummins pulls out of IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 నుంచి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్పుకున్నాడు. దేశం కోసం క్రికెట్ ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నని మంగళవారం కమిన్స్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్‌లో ఆడడం లేదని తెలిపాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున కమిన్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. 2021 వేలంలో కమిన్స్ భారీ ధర పలికిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2023కి దూరంగా ఉండాలనుకోవడం కఠిన నిర్ణయమేనని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు. 'ఐపీఎల్ 2023కి దూరంగా ఉండాలనే కఠిన నిర్ణయం తీసుకున్నా. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నా. వచ్చే ఏడాది వన్డే, టెస్టు మ్యాచులతో ఆస్ట్రేలియా షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్, వన్డే ప్రపంచకప్ ముందు కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా' అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
I’ve made the difficult decision to miss next years IPL. The international schedule is packed with Tests and ODI’s for the next 12 months, so will take some rest ahead of an Ashes series and World Cup. pic.twitter.com/Iu0dF73zOW
— Pat Cummins (@patcummins30) November 14, 2022
ప్యాట్ కమిన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కన్నా.. దేశం కోసమే ఆడడం ముఖ్యమని కమిన్స్ నిరూపించాడని ఫాన్స్ అభినందిస్తున్నారు. భారత ఆటగాళ్లు కూడా కమిన్స్ లాగా ఐపీఎల్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా.. దేశం కోసం ఆడాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు టీమిండియా ఫాన్స్ భారత ఆటగాళ్లపై సెటైర్లు పేల్చుతున్నారు. 'టీమిండియా ప్లేయర్స్ ఐపీఎల్ ఆడకుండా ఉండలేరు', 'గాయంతో జట్టుకు దూరమై టీ20 ప్రపంచకప్ 2022 ఆడని జస్ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్ 2023 మాత్రం ఆడతాడు' అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కీరన్ పొలార్డ్.. ఇకపై కోచ్‌గా సేవలు!
Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook