KKR vs LSG: ఎవిన్ లూయిస్ అత్యద్భుతమైన క్యాచ్, కేకేఆర్ ఓటమికి కారణం అదే

KKR vs LSG: ఐపీఎల్ 2022 ఈసారి అద్భుతమైన క్యాచ్‌లకు వేదికగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో అటువంటిదే సెన్సేషనల్ కన్పించింది. ఆ క్యాచ్ ఏంటో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2022, 10:12 AM IST
  • విజయం అంచువరకూ వెళ్లి ఓడిపోయిన కేకేఆర్, ఎవిన్ లూయిస్ సెన్సేషనల్ క్యాచ్ కారణం
  • రింకూసింగ్ ఆడిన స్క్వేర్ షాట్‌ను అద్భుతంగా డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో పట్టుకున్న ఎవిన్ లూయిస్
  • కేకేఆర్ ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పిన ఎవిన్ లూయిస్ క్యాచ్
KKR vs LSG: ఎవిన్ లూయిస్ అత్యద్భుతమైన క్యాచ్, కేకేఆర్ ఓటమికి కారణం అదే

KKR vs LSG: ఐపీఎల్ 2022 ఈసారి అద్భుతమైన క్యాచ్‌లకు వేదికగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో అటువంటిదే సెన్సేషనల్ కన్పించింది. ఆ క్యాచ్ ఏంటో చూద్దాం..

ఐపీఎల్ 2022లో బుధవారం నాడు జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ చివరివరకూ రసవత్తరంగా సాగింది. కేవలం 2 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమి పాలైంది. విజయం అంచులవరకూ వచ్చి ఓడిపోవడానికి కారణం ఎవిన్ లూయిస్ తీసుకున్న ఆ అద్భుతమైన క్యాచ్. 

విజయం అంచులవరకూ వచ్చి ఓడిపోవడమనేది నిజంగానే దురదృష్టకరం. లక్నో సూపర్ జెయింట్స్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రారంభం నుంచి ధాటిగానే ఆడింది. అయితే 15 ఓవర్ల ముగిసేసరికి కీలకమైన వికెట్లు పడిపోవడమే కాకుండా రిక్వైర్డ్ రన్‌రేట్ ఏకంగా 20 దాటి ఉండటంతో ఇక విజయంపై ఆశలు వదిలేసుకుంది. ఆ తరుణంలో రింకూ సింగ్ ఆడిన స్మాషింగ్ ఇన్నింగ్స్ కేకేఆర్ జట్టును విజయం అంచులవరకూ తీసుకెళ్లింది. విజయం అందుకోవల్సిందే..కానీ రింకూసింగ్ ఆడిన షాట్‌ను ఎవిన్ లూయిస్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో కేకేఆర్ జట్టు విజయం అందుకోలేకపోయింది. రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. రింకూ సింగ్ కేవలం 15 బంతుల్లో 40 పరుగులు చేశాడు. 

చివర్లో 2 బంతుల్లో 3 పరుగులు కావల్సి ఉండగా..రింకూసింగ్ ఆడిన స్క్వేర్ షాట్‌ను ఎక్కడో దూరంగా ఉన్న ఎవిన్ లూయిస్..అత్యద్భుతంగా పర్ఫెక్ట్ డైవింగ్‌తో ఎడమచేతితో పట్టుకోగలిగాడు. అంతే రింకూ సింగ్ నిరాశగా వెనుదిరిగాడు. రీప్లేలో చూస్తేగానీ చాలామందికి అర్ధం కాలేదు. ఎంత అద్భుతమైన డైవ్ సింగిల్ హ్యాండెడ్ క్యాట్ అనేది. ఆ తరువాత బంతికి..రింకూ స్థానంలో వచ్చిన ఉమేష్ యాదవ్ క్లీన్‌బౌల్డ్ అవడంతో 2 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. కేకేఆర్ భారంగా...ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ అద్భుతమైన క్యాచ్ మీరు కూడా చూడండి..

Also read: IPL Kolkata Vs Lucknow: చివరి బంతి వరకు ఉత్కంఠ.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో లక్నో గెలుపు... ఇంటి ముఖం పట్టిన కోల్‌కతా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News