Taskin Ahmed: మార్క్ వుడ్ స్థానంలో టస్కిన్‌ ఆహ్మద్‌.. బంగ్లా పేసర్ టీ20 గణాంకాలు ఇవే!!

Taskin Ahmed to replace Mark Wood for Lucknow in IPL 2022. బంగ్లాదేశ్‌ స్టార్‌ పేసర్‌ టస్కిన్‌ ఆహ్మద్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. ఐపీఎల్‌ 2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 04:55 PM IST
  • ఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్‌ స్టార్ ప్లేయర్ ఎంట్రీ
  • మార్క్ వుడ్ స్థానంలో టస్కిన్‌ ఆహ్మద్‌
  • బంగ్లా పేసర్ టీ20 గణాంకాలు ఇవే
Taskin Ahmed: మార్క్ వుడ్ స్థానంలో టస్కిన్‌ ఆహ్మద్‌.. బంగ్లా పేసర్ టీ20 గణాంకాలు ఇవే!!

Here is Bangladesh pacer Taskin Ahmed's T20 Stats: బంగ్లాదేశ్‌ స్టార్‌ పేసర్‌ టస్కిన్‌ ఆహ్మద్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్‌ 2022లో బంగ్లా ఆటగాడు ఆడనున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. గాయపడిన మార్క్‌ వుడ్‌ స్థానంను టస్కిన్‌  ఆహ్మద్‌తో భర్తీ చేయాలని లక్నో ప్రాంఛైజీ భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే లక్నో అధికారిక ప్రకటన చేయనుందట.

ఐపీఎల్ 2022 మెగా వేలంలో 7.5 కోట్ల రూపాయ‌ల‌కు ల‌క్నో సూపర్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ మార్క్ వుడ్.. మోచేయి గాయంతో మెగా టోర్నీకి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. టోర్నీకి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వుడ్ స్థానంలో ప్ర‌త్యామ్నాయ బౌల‌ర్‌ను వెతికే ప‌నిలో ల‌క్నో నిమ‌గ్న‌మైంది. ఈ క్ర‌మంలోనే బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ టస్కిన్‌ అహ్మద్‌ను జ‌ట్టులో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అహ్మ‌ద్‌ను జ‌ట్టులోకి తీసుకోవ‌డానికి ల‌క్నో మెంటార్ గౌతమ్ గంభీర్ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాడ‌ని స‌మాచారం. ఇప్పటికే గౌతీ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డును సంప్రదించినట్లు తెలుస్తోంది. 

'బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ టస్కిన్‌ అహ్మ‌ద్‌ను ల‌క్నో జట్టులోకి తీసుకుకోవాలని చూస్తున్నాం. అత‌న్ని మొత్తం సీజన్ ఆడుతాడు. టస్కిన్‌
ఈ ఆఫర్‌కు అంగీకరిస్తే.. దక్షిణాఫ్రికాతో బంగ్లా ఆడ‌బోయే రెండు టెస్టుల కంటే ముందే భారత్‌కు రావాల్సి ఉంటుంది' అని గౌతం గంభీర్ బంగ్లా బోర్డుతో అన్నట్లు స‌మాచారం. ఇదే నిజం అయితే టస్కిన్‌ ఐపీఎల్ ఆడడం ఇదే మొదటిసారి అవుతుంది. 

టస్కిన్‌ అహ్మ‌ద్‌ బంగ్లా తరఫున 33 టీ20లు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 2/12గా ఉన్నాయి. టస్కిన్‌ గణాంకాలు అంతగా లేకపోయినా.. క‌చ్చిత‌మైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. 27 ఏళ్ల ఈ బంగ్లా పేస‌ర్ కొత్త బంతితో ఆరంభంలో ప్రత్యర్థిని కట్టడి చేస్తూ వికెట్లు ప‌డగొట్ట‌గ‌ల‌డు. అందుకే ల‌క్నో అతడిని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఐపీఎల్ 2022 మార్చి 25న ఆరంభం కానుంది. లీగ్ మొదటి మ్యాచులో చెన్నై, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో మార్చి 28న తలపడనుంది. ఐపీఎల్ 2022 ద్వారానే లక్నో మెగా టోర్నీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. 

Also Read: RRR: ఇండియన్ సినీ హిస్టరీలో 'ఆర్ఆర్ఆర్' సంచలనం కాబోతుందా.. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నీ బద్దలవుతాయా..

Also Read: Shabaash Mithu Teaser: శభాష్‌ మిథు టీజర్ వచ్చేసింది.. బ్లూ జెర్సీలో మెరిసిన తాప్సీ! రవిశాస్త్రి అదుర్స్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News