IPL 2022 Match 1 CSK Playing 11 vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022కు సమయం దగ్గరపడుతోంది. మరికొద్ది గంటల్లో క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. లీగ్ మొదటి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య శనివారం రాత్రి ముంబైలోని వాంఖడే మైదానంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల కెప్టెన్లు కొత్తవారే కావడంతో తొలి మ్యాచ్‌పై ఎన్నడూ లేనంత ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి చూద్దాం.
ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నై సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి.. అభిమానులకు షాకిచ్చాడు. దాంతో రవీంద్ర జడేజా నయా సారథిగా ఎన్నికయ్యాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో జడేజా తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. కెప్టెన్సీ వదిలేయడంతో మహీకి ఇదే చివరి సీజన్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా ఈ ఏడాది జడేజాకు దగ్గరుండి మరి ధోనీ సలహాలు, సూచనలు ఇవ్వనున్నాడు.
గత సీజన్‌లో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ రాణించిన విషయం తెలిసిందే. ఈసారి ఫాఫ్ బెంగళూరు జట్టుకు వెళ్లిపోవడంతో.. న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే అతడి స్థానంలో బరిలోకి దిగనున్నాడు. మొయిన్ అలీ ఫస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో లేడు కాబట్టి రాబిన్ ఉతప్ప మూడో స్థానంలో బరిలోకి దిగుతాడు. నాలుగులో అంబటి రాయుడు రానున్నాడు. ఇక కెప్టెన్ జడేజా ఐదో స్థానంలో ఆడనున్నాడు. ఆపై శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ రానున్నారు.
8వ స్థానంలో వెస్టిండీస్ వెటరన్ ప్లేయర్ డ్వేన్ బ్రావో బరిలోకి దిగుతాడు. ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్‌లకు పేస్ విభాగంలో అవకాశం దక్కనుంది. ఈ ముగ్గురిపైనే చెన్నై ఆశలు పెట్టుకుంది. బ్రావో, జోర్డాన్‌లు బ్యాటింగ్ కూడా చేయగలరు. ఇక ఆగాయపడిన దీపక్ చాహర్ స్థానంలో అండర్ 19 ప్లేయర్ రాజవర్ధన్ హంగార్గేకర్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్‌కు మొయిన్ అలీ దూరమవడంతో జడేజా ఒక్కడే స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. మొత్తానికి చెన్నై అన్ని విభాగాల్లో పటిష్టంగానే ఉంది.
చెన్నై తుది జట్టు (అంచనా):
రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ (కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, రాజవర్ధన్ హంగార్గేకర్.
Also Read: IPL 2022: మెరుపు హాఫ్ సెంచరీ బాదిన ఫాఫ్ డుప్లెసిస్.. కెప్టెన్‌గా ఇదే తొలి విజయం! కోహ్లీ దూరం!!
Also Read: RRR Twitter Review: థియేటర్స్ బాక్సులు బద్దలు కాకుంటే ఒట్టు.. ఔట్ ఆఫ్ ది వరల్డ్ రాంపేజ్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook