DC vs PBKS: కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఐపీఎల్ 2022పై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ!

IPL 2022, DC vs PBKS match venue changed. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాళ్లకు క‌రోనా వైర‌స్ సోకడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బుధ‌వారం పుణెలో పంజాబ్‌ కింగ్స్‌తో జ‌రగాల్సిన మ్యాచ్ వేదిక‌ను ముంబైకి మార్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 05:12 PM IST
  • కరోనా వైరస్ ఎఫెక్ట్
  • ఐపీఎల్ 2022పై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
  • మ్యాచ్‌ వేదిక మార్పు
DC vs PBKS: కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఐపీఎల్ 2022పై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ!

DC vs PBKS match venue changed from MCA to Brabourne due to Covid 19 Cases: దేశంలో ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మహమ్మారి.. 2-3 రోజుల నుంచి విజృంభిస్తోంది. సోమవారం (ఏప్రిల్ 18) 4 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా.. 1247 మందికి పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కేసులు ఎప్పటిలానే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిణామాలు ఫోర్త్ వేవ్‌కు దారి తీసే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. అయితే మహమ్మారి ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022పై కూడా పడుతోంది. 

ఢిల్లీ క్యాపిట‌ల్స్ జట్టులో క‌రోనా వైర‌స్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ముందుగా ఫిజియో ప్యాట్రిక్ ఫ‌ర్హ‌త్‌ వైరస్ బారిన పడగా.. ఆపై ప్లేయర్ మిచెల్ మార్ష్‌ కూడా మహమ్మారి బారిన పడ్డాడు. వీరితో పాటు మ‌సాజ్ థెర‌పిస్ట్ చేత‌న్ కుమార్‌, టీమ్ డాక్ట‌ర్ అభిజిత్ సాల్వి, సోష‌ల్ మీడియా కాంటెంట్ మెంబ‌ర్ ఆకాశ్ మానేల‌కు కూడా వైర‌స్ సోకింది. ప్రస్తుతం వీరందరూ ప్రత్యక క్వారంటైన్‌లో ఉన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్న అందరూ బాగానే ఉన్నారు. వీరికి ఆరో రోజు, ఏడో రోజు ప‌రీక్ష‌లు నిర్వహిస్తారు. అందులో నెగ‌టివ్ వ‌స్తేనే తిరిగి జ‌ట్టులో చేరుతారు. 

ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాళ్లకు క‌రోనా వైర‌స్ సోకడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బుధ‌వారం పుణెలో పంజాబ్‌ కింగ్స్‌తో జ‌రగాల్సిన మ్యాచ్ వేదిక‌ను ముంబైకి మార్చింది. బ్రాబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ, పంజాబ్‌ జట్ల  మ్యాచ్ జ‌రుగుతుంద‌ని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కేసులను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా పేర్కొన్నారు. మ్యాచ్ వేదిక మారినట్టు ఢిల్లీ ప్రాంచైజీ కూడా ట్విట్టర్ వేదికగా తెలిపింది. 

బుధ‌వారం ఉద‌యం ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాళ్లకు ఆర్టీపీసీర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఆ ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వచ్చిన వారు మాత్రమే మ్యాచ్ ఆడనున్నారు. జట్టుకు 11 మంది అందుబాటులో ఉంటే మ్యాచ్ జరగుతుంది. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. కరోనా కేసుల ప్రభావం జట్టుపై పడే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Chahal-Dhanashree: సీన్ రివర్స్.. చహల్‌ను ఇంటర్వ్యూ చేసిన ధనశ్రీ! ఫన్నీ ప్రశ్నలతో ఆటాడుకుందిగా

Also Read: Honey Facial Benefits: తేనె వినియోగంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News