LSG vs CSK: టాస్ గెలిచిన లక్నో.. చెన్నైదే బ్యాటింగ్! మూడు మార్పులతో బరిలోకి సీఎస్‌కే!!

IPL 2022, CSK VS LSG Toss. ఐపీఎల్‌ 2022లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 07:32 PM IST
  • టాస్ గెలిచిన లక్నో
  • చెన్నైదే బ్యాటింగ్
  • మూడు మార్పులతో బరిలోకి సీఎస్‌కే
LSG vs CSK: టాస్ గెలిచిన లక్నో.. చెన్నైదే బ్యాటింగ్! మూడు మార్పులతో బరిలోకి సీఎస్‌కే!!

IPL 2022, CSK VS LSG Playing 11 is Out: ఐపీఎల్‌ 2022లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ కారణంగా మొదట బౌలింగ్ ఎంచుకున్నట్లు రాహుల్‌ తెలిపాడు. ఈ మ్యాచులో రాహుల్ సేన ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మొహ్సిన్ స్థానంలో ఆండ్రూ టై జట్టులోకి వచ్చాడు. 

మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ ప్లేయర్ మొయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు.  వీసా సమస్య కారణంగా ఇంగ్లండ్ నుంచి ఆలస్యంగా ముంబైకి వచ్చిన అలీ.. తొలి మ్యాచ్ జరిగే సమయానికి క్వారంటైన్‌లో ఉన్నాడు. మూడు రోజుల క్వారంటైన్‌ పూర్తవడంతో అతడు ఈరోజు మైదానంలోకి దిగుతున్నాడు. ఆడమ్ మిల్నే, డెవాన్ కాన్వే, మిచెల్ శాంట్నర్ స్థానంలో ముఖేష్ చౌదరి, మొయిన్ అలీ, 
డ్వేన్‌ ప్రిటోరియస్‌లు ఆడుతున్నారు.

ఐపీఎల్‌ 2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు ఓటమితోనే టోర్నీని ప్రారంభించారు. దీంతో ఈరోజు ఎలాగైనా మ్యాచ్‌ గెలిచి బోణీ కొట్టాలని చూస్తున్నాయి. బ్రబౌర్న్‌ స్టేడియంలో రెండో ఇన్నింగ్స్‌పై మంచు కీలక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. 

తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్‌ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, దుశ్మంత చమీరా, ఆండ్రూ టై, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌. 
చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌, రాబిన్‌ ఉతప్ప, మొయిన్‌ ఆలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్‌), శివమ్‌ దూబె, ఎంఎస్‌ ధోనీ (కీపర్‌), డ్వేన్‌ బ్రావో, డ్వేన్‌ ప్రిటోరియస్‌, ముకేశ్‌ చౌదరి, తుషార్‌ దేశ్‌పాండే.

Also Read: Hyderabad Metro Offer: ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.59తో రోజంతా మెట్రో ప్రయాణం! కండిషన్ అప్లై!

Also Read: MS Dhoni Record: చారిత్రక రికార్డుకు అడుగు దూరంలో ఎంఎస్ ధోనీ.. నేడు బద్దలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News