IPL 2021 Title Winner: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ గెల్చుకుంది. కోల్కత్తా నైట్‌రైడర్స్ జట్టు పోరాడి ఓడింది. టైటిల్ గెల్చిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని..సంచలన వ్యాఖ్యలు చేశాడు. టైటిల్ అర్హత ఆ జట్టుకే ఉందంటున్నాడు. అసలేం జరిగింది. ధోని ఎందుకిలా మాట్లాడాడు.
IPL 2021 Winner CSK కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni)చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి..వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ 2021 టైటిల్ అర్హతపై కీలక వ్యాఖ్యలు చేశాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే(CSK)జట్టు.. కేకేఆర్ జట్టుని 27 పరుగుల తేడాతో ఓడించి నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. 2010, 2011, 2018లో టైటిల్ గెల్చిన చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి 2021లో టైటిల్ సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడాడు. గణాంకాలను బట్టి చూస్తే... నిలకడ కలిగిన జట్టుగా మాకు మంచి పేరు ఉందని ధోనీ తెలిపాడు. అదే సమయంలో తాము ఫైనల్లో ఓడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నాడు. అందుకే ఈసారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని అనుకుని.. బాగా ఇంప్రూవ్ అయ్యామని చెప్పాడు. ఇది జట్టు సమిష్టి విజయమని చెప్పాడు. తొలుత కాస్త ఒత్తిడికి గురైనా..ఆ తరువాత కోలుకున్నామన్నాడు. అయితే, వ్యక్తిగతంగా.. గొప్పగా రాణించే ఆటగాళ్లు ఉండటం తమకు కలిసొచ్చిందని ధోనీ చెప్పాడు.
ఇప్పుడు దుబాయ్‌లో ఉన్నామని...ఒకవేళ దక్షిణాఫ్రికాలో ఉన్నా సరే అభిమానుల మద్దతు ఇలాగే ఉంటుందని, అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ధోనీ అన్నాడు. తనవరకు మాత్రం తాను చెన్నై చేపాక్ స్డేడియంలో ఉన్నట్టే భావిస్తున్నానని..మరోసారి చెన్నై అభిమానుల కోసం ఆడే అవకాశం వస్తుందని భావిస్తున్నానన్నాడు.
ఇక సీఎస్కే జట్టు కంటే ముందు కేకేఆర్ జట్టు (KKR)గురించి తప్పకుండా చెప్పాలన్నాడు ధోనీ. సీజన్ తొలిదశలో అంటే ఇండియాలో ఐపీఎల్ 2021 (IPL 2021)జరుగుతున్నప్పుడు కేకేఆర్ జట్టు చాలా పరాభవాల్ని ఎదుర్కొందని..అయినా సమిష్టిగా పోరాడి ముందుకొచ్చారని ప్రశంసించాడు. తొలిదశలో అంత పరాజయం మూటగట్టుకున్నా..ఇక్కడి వరకూ రావడం చాలా కష్టంతో కూడుకున్నపనిగా ధోనీ తెలిపాడు. ఐపీఎల్ 2021 టైటిల్ విజేత(IPL 2021 Title Winner)అయ్యే అర్హత ఎవరికైనా ఉందంటే అది కేవలం కేకేఆర్ జట్టుకేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ జట్టు ఆటతీరు అమోఘమన్నాడు. వాస్తవానికి ఐపీఎల్ విరామం కేకేఆర్ జట్టుకు మేలే చేసిందన్నాడు ధోనీ. ఐపీఎల్ 2021 రెండవదశలో మోర్గాన్ సేన అద్భుతంగా రాణించిందన్నాడు.
Also: IPL 2021 Final: రుతురాత్ గైక్వాడ్‌పై ప్రశంసలు కురిపించిన సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook