Piyush Chawla: టీమిండియా ప్లేయర్ పీయుష్ చావ్లా(Piyush Chawla) సరికొత్త రికార్డ్‌ని సృష్టించాడు. టీ 20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. శుక్రవారం ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
పీయుష్ చావ్లా ముంబై ఇండియన్స్(Mumbai indians) తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో మహ్మద్ నబీని ఔట్ చేయడం ద్వారా పీయూష్ ఈ ఫీట్ సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు (263) తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా(Amit Mishra) (236 మ్యాచ్‌ల్లో 262 వికెట్లు) పేరిట ఉండేది. పీయూష్ చావ్లా 249 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ని సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో166 వికెట్లతో మిశ్రా రెండో స్థానంలో ఉండగా 157 వికెట్లతో చావ్లా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
Also read: SRH vs MI: ఎస్ఆర్హెచ్పై విజయం, ప్లే ఆఫ్‌కు దూరం
నబీ ఘనత
అయితే ఇదే మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు మొహమ్మద్ నబీ(Mohammad Nabi) కూడా ఓ రికార్డ్ సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నబీ మొత్తం 5 క్యాచ్‌లు పట్టి ఈ రికార్డ్‌ని సాధించాడు. ఇతడు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జేమ్స్ నీషన్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్ క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొమ్మిది వికెట్లకు 235 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెట్‌రన్‌రేట్ తక్కువ ఉండటంతో ప్లే ఆఫ్స్‌కి చేరుకోలేకపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook