IPL 2021, MI vs SRH: ముంబై ఇండియన్స్ గెలుపు.. హైదరాబాద్‌కి మూడో ఓటమి

IPL 2021, MI vs SRH match: చెన్నై: ఐపిఎల్ 2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌కి విజయం కోసం వేచిచూడక తప్పడం లేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ గెలుపు ఖాతా తెరువకుండానే వరుసగా హ్యాట్రిక్‌ ఓటమిని చవిచూసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2021, 01:55 AM IST
IPL 2021, MI vs SRH: ముంబై ఇండియన్స్ గెలుపు.. హైదరాబాద్‌కి మూడో ఓటమి

IPL 2021, MI vs SRH match: చెన్నై: ఐపిఎల్ 2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌కి విజయం కోసం వేచిచూడక తప్పడం లేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ జట్టు చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ గెలుపు ఖాతా తెరువకుండానే వరుసగా హ్యాట్రిక్‌ ఓటమిని చవిచూసింది. 

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బ్యాటింగ్ విషయానికొస్తే... ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (40: 39 బంతుల్లో 5 ఫోర్లు), రోహిత్‌ శర్మ (32: 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు శుభారంభాన్నిచ్చారు. ఆఖర్లో కీరన్‌ పొలార్డ్‌ (35 నాటౌట్‌: 22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు) చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది. 

Also read : Sunrisers Hyderabad Full Squad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఆటగాళ్లు, వారి ప్రదర్శన వివరాలు

ముంబై ఇండియన్స్‌ని తక్కువ పరుగులకే ఔట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) లక్ష్యఛేదనలో మాత్రం చతికిలబడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ జట్టు నిర్దేశించిన 151 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 19.4 ఓవర్లలో 137 పరుగులకే చాపచుట్టేసింది. అలా హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది.

బెయిర్‌ స్టో (43: 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదగా.. డేవిడ్‌ వార్నర్‌ (David Warner 36: 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత విజయ్‌ శంకర్‌ (28) కూడా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన ఆటగాళ్లు ఎవ్వరూ పెద్దగా రానించకపోవడంతో హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరో ఓటమిని చవిచూడకతప్పలేదు.

Also read: Ashish Nehra: అది మార్చుకోకపోతే టీమిండియాలోకి Manish Pandey కష్టమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News