IPL 2021 Final: రుతురాత్ గైక్వాడ్‌పై ప్రశంసలు కురిపించిన సీఎస్‌కే ఓపెనర్ డుప్లెసిస్

IPL 2021 Title గెల్చుకోవడం ద్వారా మరోసారి సత్తా చాటిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓపెనర్ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. సీఎస్‌కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డుప్లెసిస్..అతనిపై ప్రశంసలు కురిపించాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2021, 10:22 AM IST
  • అద్భుత బ్యాటింగ్‌తో 86 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన డుప్లెసిస్
  • రుతురాత్ గైక్వాడ్‌పై ప్రశంసలు కురిపించిన డుప్లెసిస్
  • భారత క్రికెట్ రుతురాజ్ ఓ వరమని కీర్తించిన సీఎస్‌కే ఓపెనర్ డుప్లెసిస్
 IPL 2021 Final: రుతురాత్ గైక్వాడ్‌పై ప్రశంసలు కురిపించిన సీఎస్‌కే ఓపెనర్ డుప్లెసిస్

IPL 2021 Title గెల్చుకోవడం ద్వారా మరోసారి సత్తా చాటిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓపెనర్ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. సీఎస్‌కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డుప్లెసిస్..అతనిపై ప్రశంసలు కురిపించాడు.

IPL 2021 Final Match లో అరుదైన దృశ్యాలు చాలానే సాక్షాత్కారమయ్యాయి. చెన్నై సూపర్‌కింగ్స్(Chennai Superkings)కెప్టెన్ ఎంఎస్ ధోని 3 వందల మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన అరుదైన ఘనత సాధించింది ఈ ఫైనల్ మ్యాచ్‌తోనే. మరోవైపు సీఎస్‌కే టీమ్ ఓపెనర్ డుప్లెసిస్‌కు(Du plessis)ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్ కావడం మరో విశేషం. 16 మ్యాచ్‌లు ఆడి...633 పరుగులు సాధించిన డుప్లెసిస్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అత్యధికంగా 95 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ , తన వందవ ఐపీఎల్ మ్యాచ్‌లో 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆఖరి బంతిని డుప్లెసిస్ ఆడలేదు. ఆడి ఉంటే ఆరెంజ్ క్యాప్ అతనికి సొంతమయ్యేది. టైటిల్ విజయానంతరం డుప్లెసిస్..సీఎస్‌కే జట్టు మరో ఓపెనర్ రుతురాత్ గైక్వాడ్‌పై ప్రశంసలు కురిపించాడు. రుతురాత్ గైక్వాడ్ ప్రతిభావంతుడని..ఇటువంటి మెరికల్లాంటి ఆటగాళ్లుండటం భారత క్రికెట్‌కు వరమని డుప్లెసిస్ చెప్పాడు. జట్టు బాధ్యతను భుజాలపై మోశాడని..అతడికి మంచి భవిష్యత్ ఉందని కీర్తించాడు. ఫైనల్ మ్యాచ్ తన వందవ మ్యాచ్ కావడం నిజంగా గొప్ప అదృష్టమని డుప్లెసిస్ తెలిపాడు. 

IPL 2021 Final లో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచి చెన్నై ఆటగాళ్లు ధాటిగా ఆడి..శుభారంభాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) (32 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్), ఫాప్ డుప్లెసిస్ 61 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ (626) పరుగులతో ఆరెంజ్ క్యాప్ లిస్టులో అగ్రస్థానంలో నిలవగా..ఫైనల్ మ్యాచ్‌లో రుతురాత్ గైక్వాడ్ ఆ స్కోరుని అధిగమించాడు. నేటి మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్లో సింగిల్‌ తీసి 635 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్‌ రేసులో రుతురాజ్ నిలిచాడు. కీలక సమయంలో రుతురాజ్ భారీ షాట్‌కు ప్రయత్నించి సునీల్ నరైన్ బౌలింగ్‌లో లాంగ్‌ ఆన్‌లో శివం మావికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ మొత్తం 635 పలుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం 32 పరుగులు సాధించాడు. రుతురాజ్ ఈ ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు సాధించాడు. 

Also read: IPL 2021 Final Winning Pics: ఐపీఎల్ 2021 విజయ సంబరాల్లో చెన్నై సూపర్ కింగ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News