ఐపీఎల్ సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చైన్నై సూపర్ కింగ్స్ తమ జట్టుకు సంబంధించిన కోచ్ ను ప్రకటించింది. న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ను ప్రధాన కోచ్ గా ఎంపిక చేసింది. గతంలో చెన్నైజట్టుకు ఫ్లెమింగ్ కోచ్ గా వ్యహించి మంచి ఫలితాలను రాబట్టాడు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన్నే కోచ్ బాధ్యతలు అప్పగించింది.
ఇదిలా ఉండగా బ్యాటింగ్ కోచ్ మైకెల్ హస్సీ..బౌలింగ్ కోచ్ గా భారత వెటరన్ బౌరల్ లక్ష్మీపతి బాలాజీని ఎంపిక చేసింది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్ చీఫ్ కాశీ వెల్లడించారు.
ఇక ఆటగాళ్ల ఎంపిక విషయంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్ మెంట్ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. కాగా జనవరి 27, 28 తేదీల్లో ఈ ఏడాది ఐపీఎల్ ఆటగాళ్ల వేలం బెంగళూరులో జరగనుంది.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండేళ్ల పాటు నిషేదానికి గురైన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఆ జట్టు మళ్లీ పునరాగమనం చేస్తోంది. ఈ నేపథ్యలో జట్టు ప్రదర్శన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.