ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై బెంగళూరు విజయం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2018 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడ్డాయి.

Last Updated : Apr 22, 2018, 08:48 PM IST
ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై బెంగళూరు విజయం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2018 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై బెంగళూరు విజయం సాధించింది.

తొలుత టాస్‌ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్‌ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు పంత్ (85), మ్యాక్స్‌వెల్ (4), అయ్యర్ (52), జాసన్ రాయ్ (5), గంభీర్ (3) ప‌రుగుల‌తో రాణించారు.

అనంతరం బెంగ‌ళూరు జట్టు 175 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. బెంగ‌ళూరు జట్టు నిర్ణీత 18 ఓవ‌ర్లకు గాను నాలుగు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. దీంతో ఆరు ప‌రుగుల తేడాతో ఢిల్లీపై బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. ఓపెనర్లు క్విన్టన్ డి కాక్18 పరుగులు, మానం వోరా 2 పరుగులు చేశారు.  కోహ్లీ, డివిలియర్స్‌లిద్దరూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తూ చేయాల్సిన రన్‌రేట్‌ పెరగకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, ల‌క్ష్య ఛేద‌న‌లో భాగంగా 92 ప‌రుగుల వ‌ద్ద కోహ్లీ (30) రూపంలో బెంగ‌ళూరు మూడో వికెట్‌ను కోల్పోయింది.ఆ తర్వాత అండర్సన్‌ క్రీజ్‌లోకి రాగా... డివిలియర్స్‌ మరింత రెచ్చిపోయాడు.

24 బంతుల్లో (7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు వేగంతో హాఫ్ సెంచరీని అధిగమించిన డివిలియర్స్‌ సిక్సర్లతో బెంగళూరు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అండర్సన్‌ (15) ఔటయ్యాక వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌ (17 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా వేగంగానే పరుగులు చేయడంతో బెంగళూరు జట్టు 2 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

 

Trending News