పదేళ్ళ నిరీక్షణ : ఆసీస్ పై టీమిండియా బంపర్ విక్టరీ

పదేళ్ల నిరీక్షణ అనంతరం ఆసీస్ గడ్డపై టీమిండియా అద్భుత విజయం సాధించింది

Last Updated : Dec 10, 2018, 11:16 AM IST
పదేళ్ళ నిరీక్షణ : ఆసీస్ పై టీమిండియా బంపర్ విక్టరీ

ఆడిలైడ్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. తొలిటెస్టులో 31 పరుగుల తేడాతో ఆసీస్ ను  కోహ్లీసేన ఓడించింది. టీమిండియా 323 పరుగుల టార్గెట్ ఉంచగా.. 291 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. ఫలితంగా మ్యాచ్ భారత్ వశమైంది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఈ విజయం సాధ్యపడింది. ఈ మ్యాచ్ లో బుమ్రా, ఆశ్విన్ , షమీ తలో మూడు వికెట్లు తీసి ఆసీస్ కు కోలుకోని స్థితిలో పడేశారు.

చెమటోడ్చి నెగ్గిన కోహ్లీసేన

ఒక వైపు ఆసీస్ వికెట్లు పతనమౌతున్నప్పటికీ భారత బౌలర్లపై నాథన్ లయన్ (38) ఎదురుదాడి చేశాడు. దీంతో సునాయస విజయం కాస్త..కోహ్లీసేనకు చెమటోడ్చి నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఈ విజయంతో నాల్గు మ్యాచ్ ల టెస్టు సీరిస్ లో భారత్  1 - 0 ఆధిక్యంలో ఉంది. కాగా ఈ విజయంతో కోహ్లీ సేన సరికొత్త రికార్డు సృష్టించింది. పదేళ్ల విరామం తర్వాత ఆసీస్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

Trending News