Kedar Jadhav father missing: ఇండియన్ స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్.. అసలు ఏమైందంటే?

Kedar Jadhav father News: భారత క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ మహారాష్ట్రలోని పూణెలో అదృశ్యమయ్యారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 

Last Updated : Mar 27, 2023, 10:42 PM IST
Kedar Jadhav father missing: ఇండియన్ స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్.. అసలు ఏమైందంటే?

Kedar Jadhav father missing: భారత క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ మహారాష్ట్రలోని పూణెలో అదృశ్యమయ్యారన్న వార్త షాకింగ్ కలిగిస్తోంది. మహదేవ్ జాదవ్ మార్చి 27 అంటే సోమవారం ఉదయం 11:30 నుండి పూణేలోని కోత్రోడ్ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయినట్టు సమాచారం. మహదేవ్ జాదవ్ ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో రిక్షా ఎక్కారు, కాని అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదని తెలుస్తోంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉందని చెబుతున్నారు.

దీంతో ఆయన కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఈ విషయమై అలంకార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కేదార్ జాదవ్ తండ్రి కోసం ప్రతుతం పెట్ట ఎత్తున గాలిస్తున్నారు. నిజానికి ఆయన చాలా కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో కేదార్ జాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. కేదార్ జాదవ్ 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, 16 నవంబర్ 2014న రాంచీలో శ్రీలంకతో తన మొదటి ODI ఆడాడు. 73 వన్డేల్లో జాదవ్ 42.09 సగటుతో 1389 పరుగులు చేశాడు. ఈ సమయంలో, కేదార్ జాదవ్ రెండు సెంచరీలు మరియు ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు.

కేదార్ జాదవ్ తన పేరిట 27 వికెట్లు కూడా తీశాడు. అంతర్జాతీయ T20లో అయితే జాదవ్ తొమ్మిది మ్యాచ్‌లలో 20.33 సగటుతో 58 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 93 మ్యాచ్‌లు ఆడి 22.15 సగటుతో 1196 పరుగులు చేశాడు. నాలుగు అర్ధ సెంచరీల ఇన్నింగ్స్‌లు ఆడాడు. 09 సగటుతో 1389 పరుగులు చేశాడు. ఈ సమయంలో, కేదార్ జాదవ్ రెండు సెంచరీలు. ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. 

Also Read: Ration Card Aadhar Link Deadline: రేషన్ కార్డు-ఆధార్ లింక్ చేయలేదా.. అయితే నో టెన్షన్.. ఇలా చేసేయండి!

Also Read: Thaman Copy Tune: శంకర్ ను కూడా మోసం చేసిన తమన్.. ట్యూన్ అక్కడి నుంచి తెచ్చాడా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

 

Trending News