BCCI changed 6 T20I Captains for Team India in 12 months: ఉన్నపళంగా విరాట్ కోహ్లీ కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవడంతో భారత జట్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత 12 నెలల్లో భారత జట్టుకు ఏకంగా ఏడుగురు సారథ్యం వహించారు. విరాట్ కోహ్లీ తప్పుకోవడం, గాయాలు, విశ్రాంతితో పాటుగా ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం లాంటి పరిస్థితుల కారణంగా టీమిండియాకు ఇంతమంది సారథులు మారారు. టీ20 జట్టు పగ్గాలు ఏకంగా ఆరుగురి చేతులు మారడం విశేషం. ఈ ఏడాదిలోనే పొట్టి కప్ టోర్నీ ఉండడంతో ఇది ఏమాత్రం మంచిది కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు.
ఐర్లాండ్ టూర్‌కు భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టు సారథ్య బాధ్యతలను బీసీసీఐ సెలెక్టర్లు హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. ఐపీఎల్ 2022లో హార్దిక్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. హార్దిక్ సారథిగా బాగా ఆకట్టుకోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో గత ఏడాది కాలంలో భారత టీ20 జట్టుకు బీసీసీఐ ఆరుగురు కెప్టెన్‌లని మార్చింది. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యాలు టీ20 జట్టుకు కెప్టెన్లుగా ఎంపికయ్యారు. బీసీసీఐ ఇలా నిరంతరం కెప్టెన్‌ని మార్చితే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 మధ్యలోనే ఆగిపోవడంతో జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ టూర్‌కి వెళితే.. శిఖర్ ధావన్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు శ్రీలంకలో పర్యటించింది. లంక పర్యటనలో కెప్టెన్‌గా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన గబ్బర్.. టీ20 సిరీస్‌ను 2-1తో కోల్పోయాడు. 2021 టీ20 ప్రపంచకప్ అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం, వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించడంతో రోహిత్ శర్మ సారథిగా ఎంపికయ్యాడు.
ఆపై టెస్ట్ కెప్టెన్సీని కూడా విరాట్ కోహ్లీ వదులుకోవడంతో రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యాడు. అయితే దక్షిణాఫ్రికా టూర్‌లో రోహిత్ విశ్రాంతి తీసుకోవడంతో రెండో టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, వన్డే సిరీస్‌కు కూడా సారథిగా వ్యవహరించాడు. టెస్టు సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోగా.. వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది. ఆపై రోహిత్ సారద్యంలో స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడిన భారత్ వరుస విజయాలు అందుకుంది.
ఐపీఎల్ 2022 తర్వాత రోహిత్ విశ్రాంతి తీసుకోవడంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. అయితే సిరీస్ ఆరంభానికి ముందు అతడికి గాయం కావడంతో రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ప్రొటీస్ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌లో పర్యటించే జట్టులో పంత్‌కు చోటు దక్కడంతో.. ఐర్లాండ్‌లో పర్యటించే టీ20 జట్టుకి హార్ధిక్ పాండ్యా సారథిగా ఎంపిక చేసింది బీసీసీఐ. దాంతో ఏడాది కాలంలో భారత టీ20 జట్టుకు ఆరుగురు కెప్టెన్లు మారారు.
Also Read: Ravi Teja : షూట్లో ప్రమాదం.. గాయాలపాలైనా వెనక్కి తగ్గని మాస్ మహారాజా..వాటే డెడికేషన్
Also Read: రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. ఈ 5 యోగాసనాలు చేస్తే చాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook